Begin typing your search above and press return to search.
భారత్‌లో కరోనా ఫోర్త్ వేవ్ షురూ అయిందా..?
By: Tupaki Desk | 9 Jun 2022 7:30 AM GMTభారత్‌లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. రికవరీల కంటే కొత్తగా నమోదవుతున్న కేసులే ఎక్కువగా ఉండటం వల్ల నాలుగో దశ మొదలైందనే అనుమానం వైద్యుల్లో కలుగుతోంది. బుధవారం నుంచి గురువారం వరకు 7,240 మంది కోవిడ్ బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నట్లు గుర్తించింది.
దేశంలో కొవిడ్ ఉధృతి వేగంగా కొనసాగుతోంది. తాజాగా పెరుగుతున్న కేసులు చూస్తుంటే నాలుగో వేవ్ వస్తోందేమోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా వైరస్‌లకు పుట్టినిల్లైన కేరళ.. కరోనా మొదటి, రెండో దశల్లో విలయం సృష్టించిన మహారాష్ట్రల్లో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.
భారత్‌లో బుధవారం ఒక్కరోజే 7,240 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం నమోదైన కొత్త కేసులతో మొత్తం క్రియాశీల కేసులు 32,498కి చేరుకున్నట్లు చెప్పింది. గత రోజు కంటే దాదాపు 40 శాతం ఎక్కువ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఎనిమిది మంది వైరస్‌కు బలయ్యారని పేర్కొంది. బుధవారం రోజున 3,591 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీన్ని బట్టి చూస్తే.. రికవరీల కంటే కరోనా బారిన పడుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోందని అర్థమవుతోంది. ఇప్పటి వరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 98.71 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.08 శాతం ఉంది.
మహారాష్ట్రలో బుధవారం రోజున 2,701 తాజా కేసులు నమోదయ్యాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా కేసులు నమోదైంది ఈ ఒక్కరోజే. కనీసం 42 శాతం ఇన్ఫెక్షన్లు ముంబయి నుంచి నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటికే అప్రమత్తమైన ఆ రాష్ట్ర సర్కార్ కొవిడ్‌ను కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతోంది. ప్రతి ఒక్కరు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని , కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇక వైరస్‌లకు పుట్టినిల్లయిన కేరళలోనూ కొవిడ్ మహమ్మారి కోరలు చాస్తోంది. గత 24 గంటల్లో ఈ రాష్ట్రంలో 2,271 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ వారంలో ఇక్కడ 10,805 మంది ఈ మహమ్మారి బారిన పడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తమ రాష్ట్రంలో కరోనా నిబంధనలకు కఠిన నిబంధనలు విధిస్తున్నామని.. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.
బుధవారం 3.40 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.13 శాతానికి చేరింది. క్రియాశీల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో కరోనా నాలుగో దశ ప్రారంభమైందేమోనన్న ఆందోళన అటు అధికారుల్లోనూ.. ఇటు ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది. ఇప్పటికే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో కరోనా నిబంధనలను కఠినతరం చేస్తూ మరోసారి ఆంక్షలు విధించే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.