Begin typing your search above and press return to search.
అద్భుత పరిశోధన: కోవిడ్ మరణాన్ని ముందే గుర్తించొచ్చు
By: Tupaki Desk | 6 May 2021 12:30 AM GMTదేశంలో ఇప్పుడు కరోనా కల్లోలం చోటుచేసుకుంది. కేసులు జెట్ స్పీడుగా పెరుగుతున్నాయి. ఆస్పత్రులన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఆక్సిజన్ కొరతతో చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ పరిశోధకులు కనిపెట్టిన కొత్త మెషీన్ లెర్నింగ్ నమూనాలు ఇప్పుడు కోవిడ్ మరణాలు సంభవించే అవకాశాన్ని ముందే గుర్తించేలా వారి ప్రాణాలు కాపాడేలా చేస్తోంది.
మెషీన్ లెర్నింగ్ నమూనాల ఆధారంగా కోవిడ్ మరణాలు సంభవించే అవకాశాన్ని ముందే గుర్తించే సాంకేతికతను రూపొందించినట్టు గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ పరిశోధకులు మంగళవారం ప్రకటించారు. ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ దేవప్రియకుమార్, పరిశోధక విద్యార్థులు షన్ముఖ్ అల్లె, అక్షయ కార్తికేయన్, అక్షిత్ గార్గ్ ల బృందం ఈ పరిశోధన చేసిందని వారు వెల్లడించారు.
కోవిడ్ వైరస్ ఉధృతిని బట్టి శరీరంలో జరిగే మార్పులు హార్మోన్లు వంటి బయోమార్కర్ల సాయంతో మరణించే అవకాశాలను ముందే గుర్తించవచ్చని తెలిపారు.రక్తంలోని న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, లాక్టేట్ డీహైడ్రోజెనేస్ (ఎల్.డీ.హెచ్), హైసెన్సివిటీ డీ రియాక్టివ్ ప్రోటీన్ వంటి వాటి స్థాయిల ఆధారంగా 96 శాతం కచ్చితత్వంతో 16 రోజుల ముందుగానే మరణాలను అంచనావేయవచ్చని పేర్కొన్నారు.
ఈ డేటా ఆధారంగా కోవిడ్ పేషెంట్లకు అందించే చికిత్సను మెరుగుపరిచి వారి ప్రాణాలు కాపాడవచ్చని పరిశోధకులు గుర్తించారు. వీరి పరిశోధన ఫలితంగా చావబోయే కోవిడ్ వ్యక్తులను గుర్తించి మెరుగైన చికిత్సను అందించే అవకాశం కలుగనుంది.