Begin typing your search above and press return to search.

కోవిడ్ ఎఫెక్ట్.. చైనాలో భయానక పరిస్థితులు..!

By:  Tupaki Desk   |   23 Dec 2022 3:53 AM GMT
కోవిడ్ ఎఫెక్ట్.. చైనాలో భయానక పరిస్థితులు..!
X
చైనాలో జీరో విధానాన్ని ప్రభుత్వం ఎత్తివేసిన నేపథ్యంలో అక్కడ కరోనా కేసులు విలయతాండవం చేస్తున్నారు. గత 15 రోజులుగా కేసుల సంఖ్య వేళల్లో నమోదు అవుతుంది. దీంతో చైనా ఆస్పత్రులన్నీ కరోనా రోగులకు కిక్కిరిసిపోతున్నాయి. బెడ్ల కోసం రోగులంతా ఆస్పత్రుల ఎదుట పడిగాపులు పడాల్సిన భయంకర పరిస్థితులు చైనాలో నెలకొనడం యావత్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది.

చైనాలో ఒమ్రికాన్ వేరియంట్ కు తోడుగా బీఎఫ్ 7 అనే కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. బీఎఫ్ 7 వేరియంట్ ముఖ్యంగా వృద్ధులపై ప్రభావం చూపుతుందని అక్కడి వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ వేరియంట్ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కొన్ని రోజులుగా ఎక్కువగా ఉంటుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చాంగ్ క్వింగ్ వైద్య విశ్వవిద్యాలయం ఆస్పత్రిలో చేరుతున్న రోగుల్లో దాదాపు 90 శాతం మంది కరోనా పేషెంట్లే ఉంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వృద్ధులపై కరోనా ప్రభావం ఎక్కువగా చూపుతుండటంతో మరణాల సంఖ్య సైతం గణనీయంగా పెరుగుతోంది. అయితే చైనా మాత్రం మృతుల సంఖ్యను తక్కువగా చేసి చూపిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు కరోనా రోగులకు ట్రీట్మెంట్ అందిస్తున్న వైద్యులు.. సిబ్బంది సైతం ఆ మహమ్మారి బారిన పడుతున్నారు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో విధులు హాజరు కావాల్సి వస్తుందని వారంతా ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. రోజుకు పది గంటలకు పైగా విధులు నిర్వహించాల్సి వస్తోందని వాపోతున్నారు. అయినప్పటికీ పేషంట్ల రద్దీ మాత్రం తగ్గడం లేదని చెబుతున్నారు.

చాంగ్ క్వింగ్ ఆస్పత్రికి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న బాధితులు.. వారి బంధువుల వాహనాలు రోడ్లపై బారులు తీరుతూ కన్పిస్తున్నాయి. దీంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. మరోవైపు చైనాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నారు.

ఈ కారణంగానే చైనాలో కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చైనాలో రోజు వేలాది మంది కరోనాతో మరణిస్తున్నారని అయితే ప్రభుత్వం మాత్రం తప్పుడు లెక్కలు చెబుతోందని మీడియా గగ్గోలు పెడుతోంది. కనీసం మృతదేహాలను భద్రపరిచేందుకు కూడా ఫ్రిజర్లు దొరకని పరిస్థితి ఉందని షాంఘైలో అధికారులు చెబుతున్నారు.

కోవిడ్ మృతుల అంత్యక్రియలు వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా చైనాలో లక్షలాదిగా వెలుగు చూస్తున్న కరోనా కేసులు మాత్రం అన్ని దేశాలను మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.