Begin typing your search above and press return to search.
అమెరికాకు మళ్లీ కరోనా ముప్పు
By: Tupaki Desk | 3 Aug 2021 7:30 AM GMTఅమెరికాకు మళ్లీ కరోనా ముప్పు పొంచి ఉందని.. అందరూ ముందు జాగ్రత్త చర్యగా టీకాలు వేసుకోవాలని.. అమెరికా ప్రభుత్వ వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంటోనీ ఫౌసీ పిలుపునిచ్చారు. పరిస్థితులు చూస్తుంటే మళ్లీ దిగజారుతున్నట్టు కనిపిస్తున్నాయని ఆయన హెచ్చరించాడు. కరోనా డెల్టా ప్లస్ వైరస్ అంతటా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అమెరికన్లకు సూచించాడు.
అమెరికాలో కరోనా తీవ్రత పెరిగిందని.. తాము లాక్ డౌన్ విధించాలని చూస్తున్నామని పౌసీ అభిప్రాయపడ్డారు. దీనివల్ల భవిష్యత్తులో కొంత ఇబ్బందులు, బాధను చూస్తామని.. ఎందుకంటే కేసులు పెరుగుతున్నందున ఏదో ఒక కఠిన నిర్ణయం తీసుకోకతప్పదని హెచ్చరించారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపిన నివేదికప్రకారం.. అమెరికాకు మూడో ముప్పు పొంచి ఉందని అంటున్నారు. అందుకే దీనికి పరిష్కారంగా అమెరికన్లు అందరూ టీకాలు వేయించుకోండి అని స్పష్టం చేశారు.
అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుంచి వచ్చిన తాజాగా డేటా ప్రకారం.. గత వారంతో పోలిస్తే జూలై 30తో ముగిసిన వారంలో దేశంలో కోవిడ్19 కేసులలో 64.1శాతం పెరుగుదల కనిపించింది. సగటున 66606 కేసులు నమోదయ్యాయి.