Begin typing your search above and press return to search.

కొవిడ్ న్యూ వేరియంట్స్ అలర్ట్.. బూస్టర్ డోస్ మస్ట్..!

By:  Tupaki Desk   |   25 July 2021 2:47 PM GMT
కొవిడ్ న్యూ వేరియంట్స్ అలర్ట్.. బూస్టర్ డోస్ మస్ట్..!
X
2019 చివర్లో ప్రారంభమైన ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇప్పటికీ భయపెడుతోంది. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ ఇంకా జనాల్లో భయం అలానే ఉంటుంది. రకరకాల కొత్త వేరియంట్లు పుట్టుకురావడమే ఇందుకు కారణం. కాగా, వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడిన బోలెడు మందిని మనం చూడొచ్చు. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ తీసుకున్న వారు బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలని వాదనలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా ఈ మేరకు ఇప్పటికే సూచన చేశారు. వ్యాక్సిన్ బూస్టర్ వల్లే ప్రజల్లో రోగ నిరోధక శక్త పెరుగుతుందని చెప్తున్నారు.

వ్యాక్సిన్లు రెండు డోసులు తీసుకున్నప్పటికీ తప్పకుండా బూస్టర్ డోస్ తీసుకోవాల్సిందేనని వివరిస్తున్నారు. రోగనిరోధక శక్తి పెంపునకు ప్రజలు ఇప్పటికే హెల్దీ ఫుడ్‌పై దృష్టి సారిస్తున్నారు. చికిత్స కంటే నివారణే మేలు అన్న ప్రాథమిక నియమాన్ని ప్రజలు పాటిస్తున్నట్లు కరోనా విషయంలో మనం భావించొచ్చు. ఎందుకంటే కొవిడ్ వైరస్‌కు చికిత్సగా వ్యాక్సిన్ వచ్చినప్పటికీ అది కంప్లీట్‌గా పని చేసే అవకాశాలు తక్కువే. నూతన వేరియంట్ల ప్రభావాన్ని అది ఆపలేకపోతున్నదని ఇటీవల కాలంలో తేలింది. దీంతో జనాలు కొవిడ్ నివారణా మార్గంగా విటమిన్ సి ఫ్రూట్స్‌తో పాటు తాజా కూరగాయలు, ఆకు కూరలు తీసుకుంటున్నారు. అయితే, కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత ప్రజలు కొందరు మాస్కు ధారణ, ఫిజికల్ డిస్టెన్స్ మరిచిన సంగతి వాస్తవమే. కానీ, ప్రస్తుతం మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు మళ్లీ అలర్ట్ అవుతున్నారు.

ఇక ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ గురించి తెలుసుకున్న జనాలు మాస్కును మస్ట్ వేర్‌గా భావిస్తున్నారు. అయితే, తాజాగా కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ కంటే ముందే ఆరోగ్య శాఖలు అలర్ట్ అయ్యాయి. వ్యాక్సినేషన్‌తో పాటు మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం కంపల్సరీ చేస్తున్నాయి. ఇకపోతే భారత్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో కొవిడ్ ఎఫెక్ట్ థర్డ్ వేవ్ కొన్ని చోట్ల కనిపిస్తుంది. దాంతో ప్రభుత్వం అక్కడ మట్టుకు లాక్ డౌన్ విధిస్తోంది. టీకా విషయమై ప్రజల్లోనూ అవగాహన పెరిగింది. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వస్తుండటంతో పీహెచ్‌సీ వద్ద జనం సందడి పెరగడం మనం గమనించొచ్చు. ఫస్ట్ డోస్ వేసుకుని సెకండ్ డోస్ జనం బారులు తీరడం మనం పరిశీలించొచ్చు. కాగా, వారందరూ ఇక బూస్టర్ డోస్ కూడా వెయిట్ చేసే పరిస్థితులు త్వరలో వచ్చే అవకాశముంది.

ఈ నేపథ్యంలోనే కేంద్రసర్కారు సెప్టెంబర్ వరకు భారత్‌లో పిల్లలకు కూడా కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని ఆలోచిస్తోంది. భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌ను ఇందుకు పరిశీలన చేస్తున్నారు. చాలా పురోగతి సాధించిందని, దాని విచారణ ఫలితాలు సెప్టెంబర్ వరకు బయటకు వచ్చే అవకాశముంది. కాగా, పిల్లల కోసమై జైడస్ క్యాడిలా అనే సంస్థ రూపొందించిన వ్యాక్సిన్‌ను వినియోగించబోతున్నట్లు కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే. దాంతో పాటు పెద్దలకు కొవిడ్ రెండు వ్యాక్సిన్లతో పాటు బూస్టర్ డోస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.