Begin typing your search above and press return to search.
ఘోరం : కరోనా మృతదేహం తోపుడు బండిపై తరలించి అంత్యక్రియలు
By: Tupaki Desk | 13 Sep 2020 11:30 PM GMTకరోనా ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి మనుషుల మధ్య దూరాన్ని పెంచింది. భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తుండగా అసలు మనుషులు - మనషుల మధ్య దూరం పాటిస్తున్నారు. ఇదివరకులా అభిమానాలు, ఆప్యాయతలు ఉండటం లేదు. అంతకుముందు ఏదైనా ఆరోగ్యం బాగోలేకపోతే దగ్గరుండి పరామర్శించేవారు. ఇప్పుడు కరోనా అంటే అల్లంత దూరానికి పరిగెడుతున్నారు. ఏదో పురుగుల్లా చూస్తున్నారు. ఇక వ్యాధితో చనిపోతే అటు వైపు బంధువులు, ఇరుగు పొరుగు కనిపించడం లేదు. కొంతమంది మంది అయితే కన్న తల్లిదండ్రులు చనిపోయినా పట్టించు కోవడం లేదు.
మహారాష్ట్రలోని పూణెలో ఓ యువకుడు కరోనాతో చనిపోగా బంధువులు మృతదేహాన్ని తోపుడు బండిపై తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఖానాపూర్ కు చెందిన ఓ యువకుడికి ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే ఆ యువకుడికి ఇది వరకే శ్వాసకు సంబంధించి సమస్య ఉంది. అతడిని కుటుంబీకులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఆస్పత్రిలోని క్వారంటైన్ వార్డులో బెడ్లు ఖాళీ లేక పోవడంతో ఆ యువకుడు వైద్యులకు చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తరలించేందుకు కుటుంబీకులు అంబులెన్సుకు కాల్ చేయగా సిబ్బంది పట్టించుకోక పోవడంతో చేసేదిలేక మృతదేహాన్ని తోపుడు బండిపై తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే అంబులెన్సు రాలేదని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి స్పందిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.