Begin typing your search above and press return to search.

కొవిడ్ రోగులు బ‌య‌ట‌కు వెళ్లి టీ తాగి, స‌మోసా తిని వ‌స్తున్నారు!

By:  Tupaki Desk   |   5 May 2021 2:30 AM GMT
కొవిడ్ రోగులు బ‌య‌ట‌కు వెళ్లి టీ తాగి, స‌మోసా తిని వ‌స్తున్నారు!
X
క‌రోనా లేని మ‌నుషుల విష‌యంలోనే ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధిస్తోంది. మ‌రి, కొవిడ్ వ‌చ్చిన వారి విష‌యంలో ఇంకెలాంటి ఆంక్ష‌లు విధించాలి? కానీ.. వాళ్లకు ఎలాంటి నిబంధ‌న‌లూ లేవంటే మీరు న‌మ్ముతారా? ఆసుప‌త్రి నుంచి ఇష్టారాజ్యంగా బ‌య‌ట‌కు వెళ్లి.. తిరిగి వ‌స్తున్నారంటే విశ్వ‌సిస్తారా? కానీ.. ఇక్కడ మాత్రం నమ్మి తీరాల్సిందే. అదే.. హైదరాబాద్ లోని కింగ్ కోఠి ఆసుపత్రి.

కరోనా పాజిటివ్ తో ఇక్కడ చేరిన రోగులు.. కాస్త కుదురుకున్న తర్వాత బయటకు వెళ్లి వస్తున్నారట. బయట ఓ ఛాయ్ తాగి, ప్రశాంతంగా చెట్ల కింద కూర్చొని, కాసేపటి తర్వాత తిరిగి వస్తున్నారట. అయితే.. ఈ విషయాలేవీ అక్కడి సిబ్బందికి తెలియట్లేదట‌!

స‌రిప‌డా వైద్యులు లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని స‌మాచారం. నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ప్ర‌తీ ఐదు బెడ్ల‌కు ఒక వైద్యుడు ఉండాలి. కింగ్ కోటి ఆసుప‌త్రిలో మొత్తం 28 మంది వైద్యులు మాత్ర‌మే ఉన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టు నుంచి వ్యాక్సినేష‌న్ వ‌ర‌కు అన్ని విధులూ వీరే నిర్వ‌ర్తించాల్సి వ‌స్తోంద‌ట‌. దీంతో.. ఆసుప‌త్రి ఇన్ పేషెంట్ల వ‌ద్ద పూర్తిస్థాయిలో వైద్యులు ఉండ‌లేక‌పోతున్నార‌ట‌.

వైద్యుల‌తోపాటు సిబ్బంది కొర‌త కూడా వేధిస్తోంద‌ని స‌మాచారం. అంతేకాదు.. ఉన్న‌వారిలోనూ ప‌లువురు కొవిడ్ బారిన ప‌డ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే దాదాపు 40 మంది వ‌ర‌కు వివిధ ద‌శ‌ల్లో కొవిడ్ బారిన ప‌డ్డ‌ట్టు స‌మాచారం. వారిలో కొంద‌రు కోలుకొని తిరిగి డ్యూటీకి వ‌స్తున్నా కూడా సిబ్బంది కొర‌త వేధిస్తోంద‌ట‌.

ఇన్ని కార‌ణాల‌తో రోగులు బ‌య‌ట‌కు వెళ్లి, వ‌చ్చే విష‌యాన్ని గుర్తించ‌లేక‌పోతున్నట్టు స‌మాచారం. ప‌క్క బెడ్ వారికి బ‌య‌ట‌కు వెళ్లివ‌స్తామ‌ని చెప్పి.. తాపీగా వెళ్లి వ‌స్తున్నార‌ట రోగులు. దీనివ‌ల్ల బ‌య‌టి వారికి వైర‌స్ వ్యాపించే అవ‌కాశం ఉంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.