Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: తెలంగాణలో 'కరోనా' ఆంక్షలు షురూ..

By:  Tupaki Desk   |   25 Dec 2021 1:51 PM GMT
బ్రేకింగ్: తెలంగాణలో కరోనా ఆంక్షలు షురూ..
X
‘ఒమిక్రాన్’ కరోనా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 2 వరకూ బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. ఇతర కార్యక్రమాల్లో మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

తెలంగాణలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతోందని.. ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలు, సంప్రదాయ వేడుకల్లో మాస్కులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం లేదని రవిచందర్, చిక్కుడు ప్రభాకర్, పవన్ కుమార్ తదితర న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో పలు ఉత్సవాల్లో జనం భారీగా గుమిగూడే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం వేడుకలను నియంత్రించాలని ఆదేశించింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకలను నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

వేడుకల్లో జనం గుమిగూడకుండా ఆంక్షలు విధిస్తూ రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే ప్రభుత్వం ఇవాళ జీవో జారీ చేసింది.