Begin typing your search above and press return to search.

సెకండ్ వేవ్: దేశంలో 2.5లక్షల మంది మృతులు !

By:  Tupaki Desk   |   14 July 2021 8:57 AM GMT
సెకండ్ వేవ్: దేశంలో 2.5లక్షల మంది మృతులు !
X
కరోనా వైరస్ ... చైనాలోని వుహాన్ సిటీ లో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి ఆ తర్వాత తన వ్యాప్తి పరిమితిని పెంచుకుంటూ, మొత్తం ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. లాక్ డౌన్ అనే పదానికి అర్థం కూడా తెలియని వారు లాక్ డౌన్ వేయండి అనేలా ప్రభుత్వాన్ని అభ్యర్తించేలా చేసింది. కంటికి కనిపించని ఈ మహమ్మారి చేసిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. మొదటి వేవ్ ముగియగానే హమ్మయ్య అని అనుకునే సమయంలోనే సెకండ్ వేవ్ మొదలైంది. మొదటి వేవ్ తో పోలిస్తే, సెకండ్ వేవ్ కొంచెం బీభత్సాన్ని సృష్టించింది.

ఇక, భారత్ లో సెకండ్ వేవ్ ప్రభావానికి 2.5లక్షల మందికి పైగా చనిపోయినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే దాదాపు లక్ష మందికి పైగా చనిపోయినట్లు సమాచారం. సెకండ్ వేవ్ కారణంగా మంగళవారం రాత్రి నాటికి 2.54లక్షలకు మించిపోయినట్లు రికార్డులు చెప్తున్నాయి. మార్చి 1నుంచి వేవ్ ప్రారంభమైనట్లు లెక్కిస్తే, ముందు వేవ్ కంటే 1.57లక్షలు ఎక్కువ రికార్డ్ అయ్యాయట. మొత్తం ఇండియాలో 4లక్షల 11వేల 435 మరణాలు చోటు చేసుకున్నాయి. సెకండ్ వేవ్ సమయంలో పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మృతుల లెక్కలు పరిగణనలోకి రాకుండానేపోయాయి.

కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదుకాకుండా ఉన్నప్పటికీ కరోనా వైరస్ మృతుల సంఖ్య గతం కంటే ఎక్కువగానే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజులోనే మధ్యప్రదేశ్ కరోనా వైరస్ మహమ్మారుల మృతుల సంఖ్య వెయ్యి 481. పది రోజులుగా ఈ సంఖ్య 9వేల 733గా ఉంది. మంగళవారం ఇండియాలో నమోదైన కొత్త కేసులు 39వేల వరకూ ఉంటే అంతకుముందు రోజు 30వేల 557మాత్రమే ఉన్నాయి. మంగళవారం కరోనా మృతులు 624గా ఉండగా అంతకంటే ముందు రోజు 446 ఉన్నాయి.

కేరళలో తాజా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో 14వేల 539మంది ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. మహారాష్ట్రలో 7వేల 243కొత్త కేసులు నమోదు కాగా జూన్ 28తర్వాత అత్యల్పంగా నమోదైనట్లు రికార్డ్ నమెదైంది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య దేశం మొత్తంలో నమోదైన కేసుల్లో 55శాతంగా ఉంది. మహారాష్ట్రలో 196 కరోనా వైరస్ మృతులు, కేరళలో 124మృతులతో మునుపెన్నడూ లేనన్ని కరోనా మరణాలు నమోదవుతున్నాయి.

ఇక ఇదిలా ఉంటే నిన్న‌ 38,792 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 41,000 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,46,074కు చేరింది. మరణాల విషయానికొస్తే... నిన్న‌ 624 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,11,408కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,01,04,720 మంది కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 38,76,97,935 వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న 37,14,441 డోసులు వేశారు.