Begin typing your search above and press return to search.
ఓపెన్ మార్కెట్లోకి కోవిడ్ టీకాలు
By: Tupaki Desk | 20 Jan 2022 6:30 AM GMTతొందరలోనే కోవిడ్ టీకాలు ఓపెన్ మార్కెట్లోకి రాబోతున్నాయా ? అవుననే సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే భారత్ లో కోవిడ్ టీకాలకు వాడుతున్న వ్యాక్సినేషన్ కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్ ఓపెన్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాలని ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్ధ కు నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ఇప్పటివరకు కోవ్యాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను కేంద్ర ప్రభుత్వం అత్యవసర వినియోగం కింద మాత్రమే అనుమతిస్తున్నారు.
ఒకవైపు పై రెండు టీకాలు అవసరమైన వారందరికీ అందుబాటులో ఉండటం లేదన్నది వాస్తవం. దేశంలో ఇప్పటివరకు సుమారుగా 140 కోట్ల మందికి మొదటి డోసు టీకాలు వేశారు. అయితే రెండో డోసు వేయటానికి ఇంకా ఎంతకాలం పడుతుందో ఎవరు చెప్పలేకున్నారు. టీకాలు అందరికీ వేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రులను కూడా కేంద్రం పిక్చర్లోకి తీసుకొచ్చింది. అయితే చాలా ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకాలు వృధా అయిపోయిన విషయం అందరికీ తెలిసిందే.
పిల్లలకు టీకాలు వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చాలా మెల్లిగా అమలవుతోంది. ఇంతలోనే రెండు డోసులు వేసుకున్న పెద్దలకు బూస్టర్ డోసు వేయాల్సిన అవసరం వచ్చేసింది. పై రెండు తరగతుల వాళ్ళకు టీకాలు వేయాలంటే వెంటనే సాధ్యం కావటం లేదు. అందుకనే తమ టీకాలను ఓపెన్ మార్కెట్లోకి ప్రవేశపెడితే అవసరమైన వాళ్ళు కొనుక్కుని వెయించుకుంటారంటు సీరమ్ సంస్ధ, భారత్ బయోటెక్ సంస్ధలు కేంద్రానికి రిక్వెస్టు చేశాయి.
వీళ్ళ రిక్వెస్టును పరిశీలించిన డ్రగ్ కంట్రోల్ ఉన్నతాధికారులు నిపుణుల కమిటీకి సిఫారసులు చేశారు. బహుశా కొన్ని షరతులకు లోబడి తొందరలోనే టీకాలు రెండు మార్కెట్లోకి వచ్చే అవకాశముందని అనుకుంటున్నారు. ఓపెన్ మార్కెట్లో గనుక టీకాలు దొరుకుతుంటే అవసరమైన వాళ్ళు తమిష్ట ప్రకారం కొనుక్కుని వేయించుకుంటారు. ఆరోగ్య సేతు యాప్ లో రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పుతుంది. మరి టీకాలు ఎప్పటి నుంచి ఓపెన్ మార్కెట్లో దొరుకుతుందో చూడాలి.