Begin typing your search above and press return to search.
కొవిడ్ పుట్టిన దేశంలో.. నాయకులకు టీకా అంత రహస్యమా?
By: Tupaki Desk | 26 July 2022 12:43 PM GMTచైనా అంటే ఉక్కు క్రమశిక్షణ.. అక్కడ జరిగేవేవీ బయటకు రావు.. మూడు దశాబ్దాల కిందట తియాన్మెన్ స్వ్కేర్ లో ప్రజాస్వామ్య నిరసనకారులను దారుణంగా అణచివేసినా.. మూడేళ్ల కిందట పుట్టిన కరోనా వైరస్ ను తొక్కిపెట్టినా దానికే చెల్లు. అసలు కొవిడ్ పుట్టింది చైనాలోనేనా అని అంటే ఇప్పటికీ చెప్పలేం. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ప్రపంచంలో ఎవరికీ ఆ ధైర్యం లేదు. ఆఖరికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కూడా. అదే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడైతే చైనా మీద ఒంటికాలిపై లేచేవారు. ఏకంగా కరోనాను ‘‘చైనా వైరస్’’ అంటూ ఆరోపించారు. దీనిపై చైనా సైతం ఇంతే తీవ్రంగా ప్రతిస్పందించింది. అయితే, ట్రంప్ ఓడిపోయాక చైనాకు ఇక బెంగలేకపోయింది.
డబ్ల్యూహెచ్ వోనూ లెక్క చేయక
కొవిడ్ పుట్టుక గురించి వాస్తవానికి గతేడాది మొదట్లో డబ్ల్యూహెచ్ వో నిపుణులు చైనాలో పర్యటించారు. వూహాన్ ల్యాబ్ లోనూ పరిశీలన చేసింది. కానీ, కొవిడ్ పుట్టుక గురించి కచ్చితంగాచెప్పలేకపోయింది. దీనివెనుక చైనా ఒత్తిడి ఉందనే ప్రచారం జరిగింది. ఇక కొవిడ్ పుట్టిన ఆర్నెల్లలోపే టీకా తీసుకొచ్చామంటూ ‘‘సినోవాక్’’ పేరిట చైనా గొప్పలకు పోయింది. ఆ టీకాను ప్రపంచంలోనే ఎవరూ నమ్మలేదు కూడా. అంతేకాదు.. అసలు ఈ టీకా కోసమే చైనా వైరస్ ను రేపిందా? అనే అనుమానమూ కలిగింది.
ఇకపోతే దీని తర్వాత ఆరెల్లకు భారత్ లో కొవిడ్ టీకాలు కొవాక్సిన్, కొవిషీల్డ్ అందుబాటులోకి వచ్చాయి. కాగా, భారత్ లో టీకాల పంపిణీ 200 కోట్లు దాటింది. అదే చైనాలో చూస్తే కొవిడ్ వచ్చిన మూడేళ్లకూ కొవిడ్ టీకా వేయించుకొనేలా ప్రజలను ప్రోత్సహించడానికి ప్రచారం మొదలుపెట్టారు. ఇక్కడ టీకాలు తీసుకొంటున్నవారి శాతం తగ్గుతోంది. ఇప్పటికీ చైనా జీరో కొవిడ్ పాలసీని కఠినంగా అమలు చేస్తోంది. సీసీపీ కీలక నాయకుల ఆరోగ్య రహస్యాలను బహిర్గతం చేయడం చాలా అరుదు. చైనాలో టీకా విడుదలై ఇప్పటికే రెండేళ్లవుతోంది. అక్కడి ప్రధాన నాయకులు ఎన్ని డోసులు తీసుకొన్నారో మాత్రం బహిర్గతం చేయలేదు.
జిన్‌పింగ్‌కు టీకా అట..
ప్రపంచంలోని చాలా దేశాల్లో అధ్యక్షులు, ప్రధానులు తమ ప్రజలు నిర్భయంగా కొవిడ్ టీకా తీసుకునేందుకు చాలా చర్యలు తీసుకున్నారు. స్వయంగా తామే ముందు టీకా తీసుకుని ఆదర్శంగా నిలిచారు. ఉదాహరణకు భారత ప్రధాని మోదీ ఢిల్లీ ఎయిమ్స్ లో కొవిడ్ టీకా తీసుకోవడాన్ని ఓ పెద్ద ప్రచార కార్యక్రమంగా మార్చారు. అక్కడ కొవిడ్ టీకా వేసిన నర్సులెవరు? వారి అనుభవం ఏమిటి? వారితో ఏం మాట్లాడారు? వంటి వివరాలన్నీ మీడియాకు పెద్ద వార్తలు అయ్యాయి. కానీ, కొవిడ్ పుట్టినట్లుగా చెప్పుకొనే చైనాలో అధ్యక్షుడు షీ జిన్ పింగ్ టీకా తీసుకున్నట్లు ఇంతవరకు విషయం బయటకు రాలేదు.
ఆయనే కాదు.. చైనాను పాలించే కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులైనా టీకా తీసుకున్నారా? లేదా? అనేది తేలలేదు. తాజాగా ఈ వివరాలు బయటకు వచ్చాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇతర అత్యన్నత శ్రేణి కమ్యూనిస్టు నాయకులు దేశీయంగా తయారైన కొవిడ్ టీకాను తీసుకున్నారు. ఈ విషయాన్ని చైనా అధికారికంగా ప్రకటించింది. దేశంలో టీకాల ప్రచారాన్ని ముమ్మరం చేయడం కోసం ఈ విషయాన్ని వెల్లడించింది. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ డిప్యూటీ హెడ్ జెంగ్ ఇక్సిన్ మాట్లాడుతూ.. దేశ నాయకత్వానికి స్థానిక టీకాలపై ఉన్న నమ్మకాన్ని ఇది తెలియజేసిందన్నారు. ప్రధాన నాయకులు మొత్తం దేశీయంగా తయారైన కొవిడ్-19 టీకాలే తీసుకున్నారని వెల్లడించారు.ప్రస్తుతం చైనాలో 89.7శాతం మంది టీకాలు తీసుకొన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 56శాతం మంది బూస్టర్ డోసులు కూడా పూర్తి చేసుకొన్నారు. కానీ, 80 ఏళ్లు పైబడిన వారిలో కేవలం 61శాతం మంది మాత్రమే ప్రైమరీ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవడం ఆందోళనకరంగా మారింది.