Begin typing your search above and press return to search.
కోవిషీల్డ్ - కోవాగ్జిన్..ఈ రెండింటిలో ఏ 'టీకా' సమర్థవంతంగా పనిచేస్తుందంటే ?
By: Tupaki Desk | 25 March 2021 2:30 PM GMTకరోనా వైరస్ కోరలు చాచిన చాలా రోజులకి కరోనాను అడ్డుకునే టీకా లు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు రకాల టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక మనదేశంలో కూడా ప్రముఖంగా రెండు రకాల టీకాలు వినియోగంలోకి వచ్చాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దశల వారీగా దేశ ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. ప్రస్తుత దశలో 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు, 45 ఏళ్లు పైబడిన కొమొర్బిడిటీ ఉన్నవారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఏప్రిల్ 1 నుండి 45 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు. అయితే , ఇంకా వ్యాక్సిన్ పై కొందరిలో కొన్ని అనుమానాలు తొలగిపోలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టీకా తీసుకున్న చాలా మంది లబ్ధి దారులు.. మిగతా ప్రజలను టీకా వేసుకునేందుకు ప్రోత్సహిస్తున్నారు. టీకా తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలేంటో తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెన్ కా సంయుక్తంగా తయారు చేసిన కోవిషీల్డ్ కాగా, మరొకటి దేశీయ ఫార్మా దిగ్గజ కంపెనీ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్. అయితే ఈ రెండు టీకాల్లో ఏది మంచిది అనే దానిపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏ టీకా మంచిది, ఏ టీకా ప్రభావం ఎంత, వంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల పనితీరు, వారి ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం..
కోవిషీల్డ్:
ఇది ఇంట్రామస్కులర్ టీకా
డెవలపర్: ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా చేత అభివృద్ధి చేయగా.. మన దేశంలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ఉత్పత్తి చేస్తోంది.
టీకా రకం:
వైరల్ వెక్టర్ ప్లాట్ ఫామ్ ఉపయోగించి దీనిని తయారు చేశారు.
హానిచేయని చింపాంజీ అడెనోవైరస్ కలిగి ఉంది
వైరస్ ను నియంత్రించేందుకు రోగనిరోధక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.
ఎబోలా వైరస్ కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడానికి ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించబడింది.
ఈ టీకాను రెండు డోస్‌లు వేసుకోవాల్సి ఉంటుంది.
సమర్థత: ఈ వ్యాక్సిన్ 81.3% సమర్థవంతంగా పనిచేసినట్లు మెడికల్ రిపోర్టులు చెబుతున్నాయి.
ధర – ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రైవేటు, క్లినిక్‌లకు డోస్ కు రూ. 250 చొప్పున విక్రయిస్తున్నారు.
కోవిషీల్డ్ దుష్ప్రభావాలని చూస్తే .. ఇంజెక్షన్ వేసిన చోట నొప్పిగా ఉంటుంది.తలనొప్పి,అలసట,,కండరాల లేదా కీళ్ల నొప్పులు,,జ్వరం,చలి,వికారం ఉంటుంది.
కోవాక్సిన్ వివరాలు:
కోవాక్సిన్ అనేది ఓ ఇంట్రామస్కులర్ టీకా. దీన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ ఐవి) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది.ఇది క్రియారహితం చేసిన టీకా. హోల్-విరియన్ ఇనాక్టివేటెడ్ వెరో సెల్-డ్రైవ్‌డ్ సాంకేతికతతో అభివృద్ధి చేయబడింది. క్రియారహిత వైరస్లను కలిగి, కోవాక్సిన్ క్రియాశీల వైరస్ కు వ్యతిరేకంగా రక్షణ యంత్రాంగాన్ని సిద్ధం చేయడానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజన ల్ ఇన్ఫ్లుయేంజా, రాబిస్, పోలియో, ఇతర వ్యాధులకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.దీన్ని కూడా రెండు డోసులుగా తీసుకోవాలి. మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఈ వ్యాక్సిన్ 80.6% శాతం ప్రభావితం చూపుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితం, ప్రైవేట్ ఆసుపత్రులలో రూ. 250కి లభిస్తోంది.
కోవాక్సిన్ దుష్ప్రభావాలని చూస్తే .. ఇంజెక్షన్ వేసిన చోట నొప్పి, వాపు, ఎర్రగా మారడం, దురదగా ఉంటుంది. ఇంజెక్షన్ వేసిన చేయి మొద్దుబారినట్లుగా అనిపించడం. బలహీనతగా అనిపించడం.ఒళ్లు నొప్పులు,తలనొప్పి,జ్వరం ,అనారోగ్యానికి గురైనట్లు అనిపించడం,బలహీనత,దద్దుర్లు,వికారం,వాంతులు అవుతాయి. అయినా కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అని నిపుణులు చెప్తున్నారు.