Begin typing your search above and press return to search.
కొవిషీల్డ్.. కొవాగ్జిన్ లను అంత రేటు పెట్టి కొన్న మోడీ సర్కార్
By: Tupaki Desk | 18 July 2021 4:31 AM GMTఆకలితో ఉన్న వేళలో కాసింత అన్న పెట్టినా గొప్పగా చెప్పుకుంటారు. ఆకలితో నకనకలాడిపోయి.. చావుకు దగ్గరగా వెళ్లిన వేళలో పంచభక్ష్య పరమన్నాలు పెట్టినా ప్రయోజనం ఉండదు. అప్పుడు అవసరమంతా వైద్యం మీదనే ఉంటుంది. కరోనా సెకండ్ వేవ్ మిగిల్చిన చేదు అనుభవాల నేపథ్యంలో.. తన తప్పుల్ని తెలుసుకున్న మోడీ సర్కారు.. ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉంటోంది. మొదటి దశ ముగిసి.. రెండో దశలోకి ఎంట్రీ ఇచ్చే వేళలో.. కరోనాను అంత సీరియస్ గా తీసుకోని మోడీ సర్కారు అందుకు తగ్గ ఫలితాన్ని అనుభవించిందని చెప్పక తప్పదు.
దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ను భారీగా నిర్వహించి ఉండి ఉంటే.. సెకండ్ వేవ్ తీవ్రత అంత ఎక్కువగా ఉండేది కాదన్న వాదన ఉంది. ముందస్తు జాగ్రత్తలు.. వ్యాక్సినేషన్ తో పాటు.. రాష్ట్రాలు ఏమేం చేయాలన్న విషయం మీద కేంద్రం నుంచి మార్గదర్శకాలు మరింత స్పష్టంగా.. వేగంగా వెళ్లి ఉండే సెకండ్ వేవ్ లో తెర మీదకు వచ్చిన ఎన్నో ఉదంతాలు.. వచ్చి ఉండేవి కావన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తూ ఉంటుంది. జరిగిన తప్పుల్ని వదిలేసి.. కొత్తగా తప్పులు జరగకుండా చూసుకోవటం.. మరింత అప్రమత్తంగా వ్యవహరించటం.. గతంలో చేసిన పొరపాట్లు మళ్లీ రిపీట్ కాకుండా ఉండటం లాంటి విషయాల్లో కేంద్రం సరికొత్తగా వ్యవహరిస్తోంది.
తాజాగా కొవిషీల్డ్.. కొవాగ్జిన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 66 కోట్ల వ్యాక్సిన్లకు ఆర్డర్ పెట్టిన వైనం బయటకు వచ్చింది. వీటిల్లో 37.5 కోట్ల కోవిషీల్డ్ డోసులకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకోగా.. కొవాగ్జిన్ తయారు చేసే భారత్ బయోటెక్ తో 28.5కోట్ల డోసుల్ని కొనుగోలు చేసుకున్నారు. తాజాగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్ ఆర్డర్ ను ఆగస్టు నుంచి డిసెంబరు లోపు విడుదల చేయాల్సి ఉంటుంది. అంటే.. రానున్న రోజుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత జోరుగా సాగుతుందన్న భావన కలిగేలా తాజా డీల్ ఉందని చెప్పాలి.
ఇదిలా ఉంటే.. తాజాగా చేసుకున్న కొనుగోలు ఒప్పందంలో భాగంగా ఒక్కో డోసు కోవీషీల్డ్ టీకా ధర రూ.205లకు.. కోవాగ్జిన్ ను రూ.215 ధరకు కొనుగోలు చేస్తూ నిర్ణయం తసీుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసినప్పటికీ.. వాటికి ఉండే పన్ను బాదుడుని కూడా కలుపుకుంటే.. కోవిషీల్డ్ ధర రూ.215.25 ఉండగా.. కొవాగ్జిన్ ధర రూ.225.75గా ఉండనున్నట్లు తేలుతుంది. మొత్తంగా చూసినప్పుడు గతంలో పోలిస్తే వ్యాక్సిన్ కొనుగోలుకు కాస్త ఎక్కువ ధర పెట్టినా.. భారీగా ఆర్డర్ పెట్టిన వైనం.. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత జోరుగా నిర్వహించేందుకు వీలు కలుగుతుందని చెప్పక తప్పదు.