Begin typing your search above and press return to search.
కరోనా వైరస్ కు మందు ఇదేనట..?
By: Tupaki Desk | 3 March 2020 4:20 AM GMTకరోనా వైరస్. ఇప్పుడీ పేరు చెబితేనే ప్రపంచం ఉలిక్కిపడుతోంది. ప్రాణభయంతో పరుగులు తీస్తోంది. ఆ మహమ్మారి హైదరాబాద్ కు కూడా వచ్చేసింది. తెలంగాణలో తొలి కేసు నమోదైంది. దేశంలో కొత్తగా రెండు కేసులు. దీంతో ఇప్పుడు చైనీయులే కాదు.. భారతీయులకు కూడా కరోనా భయం పట్టుకుంది.
అయితే దేశంలో కరోనా వైరస్ ను చూసి భయపడాల్సింది ఏమీ లేదని బీజేపీ అస్సాం నేత చెప్పుకొచ్చారు. కరోనాకు మందు ఉందంటూ సెలవిచ్చారు. అసోంలోని హజో అసెంబ్లీ ఎమ్మెల్యే హరిప్రియ తాజాగా కరోనా వైరస్ కు ‘గోమూత్రం, ఆవు పేడ’ చక్కటి పరిష్కారం అని హాట్ కామెంట్స్ చేశారు. ఇవీ తీసుకుంటే కరోనా మీ దరికి చేరదని.. వైరస్ రాదని చెప్పారు. అగ్ని ముందు దేవుళ్లను ఆరాధిస్తే మంచి జరుగుతుందట.. వైరస్ ప్రబలిన చైనాలో ఆవుపేడను వినియోగిస్తే అక్కడి గాలి స్వచ్ఛంగా మారుతుందని చెప్పుకొచ్చారు.
మరో విషయాన్ని కూడా హరిప్రియ విడమర్చి వివరించారు. ఆవుపేడ చల్లిన 5 కిలోమీటర్ల వరకూ దాని ప్రభావం ఉంటుందని.. దీన్ని ప్రభుత్వం బాగుంటుందని ఉచిత సలహా కూడా ఇచ్చింది. పురాతన కాలంలో పురాతన కాలంలో సాధువులు గోమూత్రం, పాలు, తేనె కలిపి తీసుకునే వారని.. పంచామృతం తీసుకోవడం వల్ల వేలాది సంవత్సరాలు జీవించారని చెప్పారామే.. వీటిని చాలా మందుల్లో వాడుతారని పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా కోసం పరిశోధనలు సాగుతున్నాయి. దీనికి మందు కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు ఆపసోపాలు పడుతున్నారు. కానీ ఈ బీజేపీ నేత మాత్రం ఆవు పేడ, మాత్రమే మందు అనడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మరి శాస్త్రవేత్తలకు తట్టని ఐడియా చెప్పిన ఈయన మాటను వాళ్లు పరిగణలోకి తీసుకుంటారో.. పరిశోధిస్తారో చూడాలి మరీ.