Begin typing your search above and press return to search.
ఫ్లూటు వాయిద్యంతో పాల ఉత్పత్తి.. బీజేపీ ఎమ్మెల్యే కొత్త సంగతి
By: Tupaki Desk | 28 Aug 2019 1:30 AM GMTశిశుర్వేత్తి పశుర్వేత్తి.. వేత్తి గాన రసః ఫణిః- అనేది పెద్దల ఉవాచ. సంగీతానికి శిశువులు - పశులు - పాములు కూడా తన్మయత్వాని కి లోనవుతాయని దీనిర్ధం. అయితే,ఇప్పడు బీజేపీ కి చెందిన అస్సాం ఎమ్మెల్యే దిలిప్ కుమార్ పాల్ ఈ సంగీతానికి సంబంధించి న కొత్త విషయాన్ని వెల్లడించారు. సంగీత పరికరాల్లో ఒకటైన వేణువు ఉరఫ్ ఫ్లూటుతో అధికంగా పాలను ఉత్పత్తి చేయొచ్చని ఆయన చెబుతున్నారు. సాధారణంగా పశుల్లో పాలనే ప్రజలు వినియోగిస్తున్నారు. గేదె - ఆవు పాలకు గిరాకీ ఎక్కువ. ఎక్కడో మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించేవారు మాత్రమే ఇప్పటికీ మేకపాలు తాగుతున్నారు తప్ప.. వీటికి అంత గిరాకీ లేదు.
అయితే, దేశంలో నానాటికీ పెరుగుతున్న జనభా సంఖ్యతో పోల్చుకుంటే పశుసంపద పెరగడం లేదు. దీంతో పాల ఉత్పత్తిపై కూడా ప్రభావం పడుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. రసాయనాలతో పెరుగుతున్న దాణా గడ్డి కూడా ప్రధాన కారణం. దీంతో పాల ఉత్పత్తులను పెంచుకోడానికి ఒకానొక దశలో దేశంలో క్షీర విప్లవానికి కూడా నాంది పలికారు. పశువుల పెంపకాన్ని ప్రభుత్వాలు అప్పట్లో ప్రధానంగా పెంచాయి. ప్రోత్సహించాయి. ఇంటికో దూడను పంచాయి. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇస్తామన్నా పెంచుకునే పరిస్థితి నేటి కాంక్రీట్ యుగంలో కనిపించడం లేదు. అయితే, పాల వినియోగం తగ్గిందా అంటే.. మిత్రు లు వచ్చినా.. బంధువులు వచ్చినా టీ లేదా కాఫీ లేదా పాలు ఇచ్చే సంస్కృతి పెరిగిన దేశంలో పాల వినియోగం పెరిగిందే తప్ప తగ్గడం లేదు.
దీంతో పాల ఉత్పత్తి పెంపు ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే పాల పౌడర్లను పెంచుతున్నారు. ఇది కూడా అనారోగ్యమని తెలియడంతో స్వచ్ఛమైన పితికే పాలకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో పశువుల నుంచి పాలను పెంచేందుకు ఇంజక్షన్లు - రసాయనాల వంటి కృత్రిమ పద్ధతులు కాకుండా.. సంగీతం ద్వారా పాలను పెంచుకోవచ్చన్నది ఈ ఎమ్మెల్యేవారి తాజా పరిశోధన సారాంశం. పాల ఉత్పత్తి పెరగాలంటే - ఆవుల ముందు ఫ్లూట్ ఊదితే సరిపోతుందంటున్నాడు. సంగీతంలో పాటు డాన్స్ ప్రత్యేకతలను వివరించిన వాటి ప్రభావం పాలిచే గేదేలపై ఉంటుందని చెప్పాడు. అస్సాంలోని ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గోన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఈ నేపథ్యంలోనే లీసెస్టర్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు మనస్తత్వ శాస్త్రవేత్తలు సైతం 2001 లోనే ఈ విషయాన్ని నిరూపించారని చెప్పారు. ఫాస్ట్ సంగీతం కంటే నెమ్మదిగా మృదువుగా ఉండే సంగీతాన్ని విన్న ఆవులు అధికంగా మూడుశాతం పాలను ఇస్తాయని నిరూపించారని చెప్పారు. దీనికి తోడు గుజరాత్ కు చెందిన ఓ ఎన్జీవో ఆర్గనైజేషన్ కూడ చేసిన రీసెర్చ్ కూడ సంగీతానికి పాల ఉత్పత్తికి సంబంధం ఉందని చెప్పారు. సంగీతం ద్వార పాల ఉత్పత్తి పెరిగిందని కూడ ఆయన చెప్పారు. మొత్తానికి సంగీతం మన మనసులకే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుందంటే కాదనేవారు ఎవరుంటారు చెప్పండి!!