Begin typing your search above and press return to search.
గ్యాంగ్ రేప్ కేసులో సీపీ సీవీ ఆనంద్ నిజాలు.. ఆర్జీవీ సెటైర్లు
By: Tupaki Desk | 8 Jun 2022 5:20 AM GMTజూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియా ముందు సంచలన విషయాలు వెల్లడించారు. అసలు రేప్ ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఈ కేసు కు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. ఈ కేసులో మైనర్లు ఉన్నందున వారి పేర్లను బయటకు వెల్లడించనని తెలిపారు. కేసుతో సంబంధం ఉన్న వారిలో ఒకరు మేజర్ కాగా.. మిగతా ఐదుగురు మైనర్ బాలురు అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ఎవరెవరు ఇన్ వాల్వ్ అయ్యారు? ఆ క్రైం ఎలా జరిగిందన్న దానిపై డీటెయిల్డ్ గా సీపీ సీవీ ఆనంద్ నిన్న రాత్రి వివరించారు. ఈ క్రమంలోనే అందరూ ఆరోపించినట్టు గ్యాంగ్ రేప్ కేసులో పెద్దల ప్రమేయం ఉందన్న వార్తలు కేవలం ఆరోపణలేనని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. దర్యాప్తులో తమకు అలాంటి క్లూ లభించలేదన్నారు. ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే తమకు సమర్పించాలని.. తప్పకుండా విచారణ చేస్తామని ఆనంద్ వెల్లడించారు.
-కౌన్సిలింగ్ తర్వాతే బాలిక విషయం చెప్పింది తనపై రేప్ జరిగిన విషయాన్ని బాలిక మొదట అవమానంతో దాచేసిందని సీపీ తెలిపారు. తల్లిదండ్రులకు కూడా చెప్పలేదని సీపీ వివరించారు. మెడపై గాయాలను చూసి ఎంత అడిగినా బాలిక సమాధానం చెప్పలేదన్నారు. దీంతో వారు మే 31న పోలీసులను ఆశ్రయించడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని.. భరోసా సెంటర్ లో 4 గంటలు బాలికకు కౌన్సిలింగ్ తర్వాత తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని బాలిక వివరాలు చెప్పిందని వివరించారు. జూన్ 1న కేసును 376-D గ్యాంగ్ రేప్ గా మార్చామన్నారు. నీలోఫర్ ఆస్పత్రిలో బాధితురాలికి చికిత్స అందించామన్నారు.
-మరో అమ్మాయి తప్పించుకొని వెళ్లిపోయింది..నిందితులు ట్రాప్ చేయడంతో బాలిక వారిని నమ్మి వెళ్లిందని సీపీ ఆనంద్ తెలిపారు. కొందరు అమ్మాయిలు ఇలాంటివి గుర్తించలేరని.. బాధితురాలితో ఉన్న మరో అమ్మాయి నిందితుల దురాలోచనను పసిగట్టి క్యాబ్ లో వెళ్లిపోయిందని తెలిపారు. కానీ ఈ అమ్మాయి వారితో వెళ్లి అత్యాచారానికి గురైందన్నారు.
ఇందులో ఒకరు మేజర్. ఐదుగురు మైనర్లు మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు సీపీ ఆనంద్ తెలిపారు. ఏ1 గా సాదుద్దీన్ తోపాటు మైనర్ నిందితులు, బాధితురాలు వాహనంలో వెళ్లారని.. మైనర్ తోపాటు సాదుద్దీన్ బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని సీపీ తెలిపారు. నిందితులను బాధితురాలు గుర్తించకపోవడంతోనే కేసు ఆలస్యమైందన్నారు. ఆధారాలతో సహా జూన్ 2న నిందితులను గుర్తించామని.. 3న సాదుద్దీన్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మిగతా వాళ్లపై కేసులు నమోదు చేశామన్నారు.ఇలాంటి కేసుల్లో శిక్షలు కఠినంగా ఉంటాయని.. భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా పబ్ ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్ తెలిపారు.
-రఘునందన్ రావు చెప్పిందే నిజమన్న ఆర్జీవీ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో రాజకీయ ప్రభావం ఉందన్నాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. నాయకులు ప్రభావితం చేయడం వల్లే పోలీసులు సరిగా విధులు నిర్వహించడం లేదన్నారు. సజ్జనార్ లాంటి సిన్సియర్ ఆఫీసర్ ను టీఎస్ఆర్టీసీకి పరిమితం చేశారని విమర్శించారు. ఎంఐఎం నేతలకు టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని పేర్కొన్నాడు. ఇక సామాన్యుడిగా నాకు మాత్రం రఘునందన్ రావు చెప్పిందే నిజమనిపిస్తోందని ట్వీట్ చేశాడు.