Begin typing your search above and press return to search.
తెలంగాణలో కమ్యూనిస్టుల కథ ముగిసినట్లేనా?
By: Tupaki Desk | 13 Dec 2018 6:38 AM GMTతెలంగాణ ఎన్నికల ఆసక్తికరమైన ఫలితాలను అందించాయని అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే, తాజాగా ఆసక్తికరమైన విశ్లేషణ తెరమీదకు వచ్చింది. తాజాగా వామపక్ష పార్టీల గురించి ఆసక్తికరమైన తెరమీదకు వచ్చింది. వామపక్ష పార్టీ తన గళం మార్చుకున్నా ఫలితం దక్కలేదని అంటున్నారు. తెలంగాణలోని ప్రధాన వామపక్ష పార్టీలైన సీపీఐ - సీపీఎంకు ఈ పరాభవం తప్పలేదని పేర్కొంటున్నారు. సామాజిక న్యాయం - బీసీ ముఖ్యమంత్రి - ప్రత్యామ్నాయ రాజకీయ విధానాల అమలు ఎజెండాతో సీపీఎం నేతృత్వంలో 28 పార్టీలతో కలిసి ఏర్పడిన బహుజన వామపక్ష కూటమి (బీఎల్ ఎఫ్) - ప్రజాకూటమి భాగస్వామ్య పార్టీగా పోటీ చేసిన సీపీఐ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి. సీపీఎం భద్రాచలం - మధిరలో మూడోస్థానంలో నిలిచినా.. డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. కూటమిలో భాగంగా హుస్నాబాద్ - వైరా - బెల్లంపల్లి నియోజకర్గాల్లో పోటీచేసిన సీపీఐ బెల్లంపల్లిలో డిపాజిట్ కోల్పోయింది.
హుస్నాబాద్ లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి 46,553 ఓట్లు పొంది ద్వితీయ స్థానంలో - వైరాలో బానోతు విజయ 32,757 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. సీపీఎం ఒంటరిగా పోటీచేసిన స్థానాల్లోనూ గత ఎన్నికల్లో ఓట్లశాతం (1.5 శాతం) కంటే ఈసారి తగ్గి (0.4 శాతం) - బీఎల్ ఎఫ్ పోటీ చేసిన స్థానాల్లోనూ 0.7 శాతం ఓట్లను మాత్రమే సాధించగలిగింది. ఆ పార్టీకి బాగా పట్టున్న మిర్యాలగూడ - నారాయణపేట - ఆలేరు - చెన్నూరు - కొత్తగూడెం - మహబూబాబాద్ తదితర స్థానాల్లో బీఎల్ ఎఫ్ - సీపీఎం అభ్యర్థులు కనీసం గుర్తింపు సంఖ్యల్లోనూ ఓట్లను సాధించలేకపోయారు. సీపీఎం (0.4 శాతం) - బీఎల్ ఎఫ్ (0.7శాతం) రెండింటి ఓట్ల శాతాన్ని కలిపినా కూడా గత ఎన్నికల్లో సీపీఎం సాధించినన్ని ఓట్లను పొందలేకపోయింది. బీఎల్ ఎఫ్ ప్రయోగాత్మకంగా గోషామహల్ నుంచి బరిలో నిలిపిన ట్రాన్స్ జెండర్ చంద్రముఖికి 120 ఓట్లు మాత్రమే దక్కాయి.