Begin typing your search above and press return to search.
కూటమిలో చీలికకు ఇది పీక్స్ !
By: Tupaki Desk | 15 Oct 2018 6:00 PM GMTతెలంగాణలో ముందస్తు ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుతోంది. అదికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునేందుకు ఎత్తుగడలు వేసిన కాంగ్రెస్ పార్టీ ఈ క్రమంలో విసిరిన మహాకూటమి పాచిక పారడం సంగతి అటు ఉంచితే...ఆదిలోనే అపహాస్యం పాలయ్యే స్థితికి చేరుతోందంటున్నారు. ఇప్పటికే సీట్ల లెక్కతేలకుండా ఆయా పార్టీల నేతలు విమర్శలు గుప్పించుకుంటే...తాజాగా కూటమిలో నుంచి ఓ పార్టీ ఏకంగా అల్టిమేటం జారీచేస్తోంది. ప్రస్తుత ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి నుంచి సీపీఐ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ఐదారు సీట్లు ఇవ్వకపోతే మాదారి మాదే - మీదారి మీదే అని సీపీఐ స్పష్టం చేసింది. మహాకూటమిలోని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఈ మేరకు అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే ఓ వైపు టీజేఎస్ నేత కోదండరాం అసంతృప్తిగా ఉన్నారంటే...ఈ అలక ఎక్కడికి దారితీస్తుందోనని పలువురు చర్చించుకుంటున్నారు.
మహాకూటమిలో భాగంగా ఉన్న సీపీఐ వైరాలో రోడ్‌షో నిర్వహించడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహాకూటమిలో సీట్ల కోసం విబేధాలు తారాస్థాయికి చేరడంతో సీపీఐ ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామం నుంచి జూలురుపాడు వరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం బైక్ ర్యాలీలతో రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిధిగా హాజరై రోడ్‌షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైరాలోని మధిర క్రాస్ రోడ్డులో జరిగిన రోడ్‌షోలో కూనంనేని సాంబశివరావు ప్రసంగిస్తూ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కావాలా, సీపీఐకు ఇవ్వాల్సిన సీట్లు కావాలా అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా బహిరంగంగా సీట్లను ప్రకటించనప్పటికీ తమ అభ్యర్థితో ప్రచారం చేయడం ఆసక్తిగా మారింది.