Begin typing your search above and press return to search.
చలో అసెంబ్లీ : ఇది చాలా హాట్ గురూ
By: Tupaki Desk | 29 Sep 2015 3:40 PM GMTవరంగల్ ఎన్ కౌంటర్ కి నిరసనగా 371 ప్రజాసంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తెలంగాణలో ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. మావోయిస్టులను బూటకపు ఎన్ కౌంటర్ చేశారంటూ ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే చలో అసెంబ్లీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తుండగా అందుకు పూర్తివిరుద్ధంగా ప్రజాసంఘాలు స్పందించాయి.
చత్తీస్ గఢ్ - ఒడిశా సరిహద్దు నుంచి హైదరాబాద్ కు మావోయిస్టులు, వారి సానుభూతిపరులు వస్తున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారు హైదరాబాద్ లో విధ్వంసం సృష్టించే అవకాశముందని, అందుకే అదనపు బలగాలతో భద్రతను పటిష్టం చేశామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో రెండు కిలోమీటర్ల వరకు ఆంక్షలు విధించారు. సభలు - సమావేశాలు - ర్యాలీలు నిషేధమని ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ....వామపక్షాలు తలపెట్టిన చలో అసెంబ్లీకి ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎవరూ పాల్గొనకూడదని, ఎవరైనా పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అయితే అనుమతి ఉన్నా, లేకపోయినా రేపు చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఆయా సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ....అక్రమ నిర్భంధం ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు. నిషేధిత సంస్థలేవీ తమలో భాగస్వామ్యం పంచుకోవడంలేదని తెలిపారు. ప్రభుత్వం ఎంత అణిచివేసినా తాము చలో అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు. ఎన్ కౌంటర్ లపై ప్రతిపక్షాలు నోరువిప్పాలని కోరారు. చలో అసెంబ్లీ ఏ విధమైన ఘటనలకు సాక్ష్యం అవుతుందో వేచిచూడాలి.