Begin typing your search above and press return to search.
గల్లీలో కుస్తీ..ఢిల్లీలో దోస్తీ..దొందు దొందే !
By: Tupaki Desk | 8 Sep 2021 1:30 PM GMTబీజేపీ, టీఆర్ఎస్‌లు డబుల్ గేమ్ ఆడుతున్నాయని సీపీఐ అగ్రనేత కె.నారాయణ విమర్శించారు. కేంద్రంలో అధికారం లో ఉన్న భారతీయ జనతాపార్టీతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల స్నేహబంధంపై మొదటి నుండి కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. తమ గుప్పిట్లో రాజ్యాంగ వ్యవస్థలను పెట్టుకున్న బీజేపీ, ప్రాంతీయ పార్టీలపై బెదిరింపులకు పాల్పడుతూ, నోరెత్తకుండా చేసుకుంటోందనే బలమైన విమర్శలు కూడా ఉన్నాయి.
ఈ విమర్శలకు బలం చేకూర్చేలా సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఘాటైన ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి అవగాహన ఉందని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ ఎస్, గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని తీవ్రమైన ఆరోపణలు చేశారు. దొందు దొందే అని అన్నారు. దేశంలో ప్రధాని మోడీ పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 27న భారత్ బంద్ కు పిలుపిస్తున్నట్టు ఆయన తెలిపారు.
భారత్ బంద్ లో టీఆర్ ఎస్ , టీడీపీ కూడా పాల్గొనాలని ఆయన కోరడం గమనార్హం. కానీ వైసీపీ పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. బీజేపీతో పరోక్షంగా అనుబంధం కొనసాగిస్తున్న టీఆర్ ఎస్, తెలుగుదేశం పార్టీలతో ఇదే సీపీఐ స్నేహాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. హుజూరాబాద్ లో టీఆర్ ఎస్ కు సీపీఐ అండగా నిలవనున్న సంగతి తెలిసిందే.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంగ్రామ యాత్ర కాదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా దగా యాత్ర చేస్తున్నాడని ధ్వజమెత్తారు. బండి పాదయాత్రలో పస లేదని. ఆయనను అసలు ప్రజలు గుర్తించటం లేదని చాడా వెల్లడించారు. తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని కేంద్రం గుర్తించిన తర్వాతనే అమిత్ షా తెలంగాణలో పర్యటించాలన్నారు.