Begin typing your search above and press return to search.
భీమవరంలో పవన్ ను ఓడించేందుకు భారీ కుట్ర
By: Tupaki Desk | 23 April 2019 11:11 AM GMTఏపీ ఎన్నికల వేడి తగ్గినా ఇంకా మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఏపీ ఎన్నికల వేళ కొన్ని అసెంబ్లీ సీట్లలో గెలిచేందుకు డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేసిన వైనం తెలిసిందే.. తాజాగా ఇదే విషయంపై సీపీఐ నేత రామకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీపీఐ నేత మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను భీమవరంలో ఓడించడానికి రాజకీయ పార్టీలు భారీ కుట్ర చేశాయని.. ఒక్కో ఓటుకు రూ.3000 ఖర్చు చేశారని ఆరోపించారు. ఇప్పుడీ మాటలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.
ఎన్నికల్లో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఎన్నికల్లో ధన ప్రవాహం ఈసీకి కనిపించలేదా అని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు.దీనిపై సుప్రీంను ఆశ్రయిస్తానని చెప్పారు. డబ్బున్నవారే ఏపీ ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో చంద్రబాబు సమీక్షలు చేయకూడదని ఈసీ మాట్లాడుతోందని.. ఇది ఎంతవరకు సమంజసమన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. పవన్ కు రూ.600 కోట్లు ఇచ్చారని ఆరోపించారు.
ఏపీలో భారీగా నగదు దొరికిన నియోజకవర్గాల్లో మళ్లీ ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నామని సీపీఐ నేత రామకృష్ణ తెలిపారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి, ఈసీని కోరుతామని తెలిపారు. ఈసీ ఏపీలో ఎన్నికల నిర్వహణలో విఫలమైందని.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.