Begin typing your search above and press return to search.
మూడు రాజధానులు..చికెన్ నారాయణకూ నచ్చలేదండోయ్!
By: Tupaki Desk | 23 Dec 2019 4:30 PM GMTఒకవైపు రాయలసీమ వాసులు చాలా సంవత్సరాలుగా తమ ప్రాంతంలో హై కోర్టు ఉండాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పెద్దమనుషుల ఒప్పందంలో కూడా హై కోర్టు ఒక చోట ఉంటే, రాజధాని మరో చోట ఉండాలని పేర్కొన్నారు. ఆ పెద్దమనుషుల ఒప్పందం ఇప్పటిది కాదు. రాజకీయాల్లో స్వార్థపరులు ఇంకా ఎంటర్ కాని కాలానిది ఆ పెద్దమనుషుల ఒప్పందం. మహామహులు చేసుకున్న ఒప్పందం అది.
సీమాంధ్రను కలిపి ఉంచాలని శ్రీబాగ్ ఒడంబడికలో ప్రాంతీయ విబేధాలు తలెత్తకుండా.. రాజధాని ఒక చోట, హై కోర్టు మరోచోట అనే నియామన్ని పెట్టుకున్నారు. ఆ ఒప్పందాన్ని చేసుకున్నారు. దశాబ్దాలు గడిచినా ఆ పెద్ద మనుషుల ఒప్పందానికి అంతే విలువ ఉంది. ప్రాంతీయ విబేధాలు రాకుండా ఆ ఒప్పందంగా ఉపయోగపడగలదు.
అయితే ఉమ్మడి ఏపీ విభజన తర్వాత పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కారు. అంతా తన ఇష్టానికి చేశారు. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీబాగ్ ఒడంబడిక అమలు దిశగా సాగుతూ ఉన్నారు.
కానీ దీన్ని చాలా మంది ఆక్షేపిస్తూ ఉన్నారు. అమరావతి అంటూ.. గ్రాఫిక్స్ విషయంలో వీరి ఆర్భాటం చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. రాయలసీమకు న్యాయంగా దక్కాల్సిన వాటి పట్ల కూడా వారు చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. వారిలో ఒకరిగా చేరారు కమ్యూనిస్టు పార్టీ నారాయణ అలియాస్ చికెన్ నారాయణ.
తన చికెన్ ప్రేమ గురించి అనేక రకాలుగా చెప్పుకున్నారు గతంలో ఈయన. గాంధీ జయంతి రోజు కూడా చికెన్ తింటూ వార్తల్లోకి వచ్చారు. దీంతో చికెన్ నారాయణగా ప్రసిద్ధులయ్యారు.
రాయలసీమకు హైకోర్టు అవసరం లేదని ఈయన తేల్చారు. వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి జరగదని చెప్పుకొచ్చారు. అంతే కాదట.. మూడు రాజధానులు ఉండటం వల్ల పరిపాలన సాగదట. అంతా ఒక విహార యాత్రలా మారుతుందట. మొత్తానికి కమ్యూనిస్టు పార్టీలు ఎప్పటికీ చంద్రబాబు తొత్తులే అనే అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఈ చికెన్ నారాయణ మాటలు అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కమ్యూనిస్టులకు ఎంతసేపూ విజయవాడ మీదే ప్రేమ ఉంటుంది, మిగతా ప్రాంతం ఏమైపోయినా వారికి పట్టదనే అభిప్రాయాన్ని కూడా నారాయణ బలపరుస్తున్నాడు.