Begin typing your search above and press return to search.
బీజేపీని వ్యతిరేకిస్తే సోదాలేనట
By: Tupaki Desk | 13 Jan 2018 10:18 AM GMTమోడీ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రధాని మోడీ కార్యాలయం నుంచే అవినీతి నడుస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా భేటీలో నారాయణ.. రామకృష్ణలు మాట్లాడారు.
చట్టాలను తమకు నచ్చినట్లుగా మార్చుకునే దిగజారుడు రాజకీయ ప్రస్తుతం నడుస్తోందన్నారు. బీజేపీని వ్యతిరేకించిన వారిపై సీబీఐ చేత దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని కార్యాలయానికి ముడుపులు ఇవ్వలేకనే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సూసైడ్ చేసుకొని చనిపోయారన్నారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై ఒత్తిడి తీసుకురావటం ఏ మాత్రం సరికాదని.. అది అప్రజాస్వామ్యంగా అభివర్ణించారు. సీబీఐ స్పెషల్ జడ్జి లోయా మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అదే సమయంలో మెడికల్ కుంభకోణంపై కూడా ప్రధానమంత్రి మోడీ స్పందించాలని నారాయణ కోరారు. ఇదిలా ఉంటే.. ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ఏపీకి కేంద్రం ఏం ఇస్తుందో వెల్లడించాలన్నారు. ఏపీ ముఖ్యమంత్రి ఈ విషయంపై రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీపై కేంద్రం చిన్నచూపు చూస్తుందని.. పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చే నిధులపై స్పష్టత ఇవ్వాలన్న ఆయన.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అందిస్తున్న సాయం గురించి వివరంగా చెప్పాలన్నారు.