Begin typing your search above and press return to search.
అలా జరిగితే కామ్రేడ్ చెవి కోసేసుకుంటారట
By: Tupaki Desk | 30 Jan 2016 7:15 AM GMTసవాళ్లు.. ప్రతిసవాళ్లతో గ్రేటర్ ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఒకరి మీద ఒకరు తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి. మీడియా మొత్తం వారి వార్తల మీదనే ఫోకస్ చేస్తున్నాయి. మరి.. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారేమో కానీ.. కొన్నేళ్లుగా తమ ప్రాభవాన్ని కోల్పోయిన కమ్యూనిస్టులు తాజాగా సరికొత్త సవాలుతో వార్తల్లోకి వచ్చేశారు.
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందన్న విషయంపై అధికారపార్టీ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్న సందర్భంగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ గళం విప్పారు. సొంతబలంతో టీఆర్ ఎస్ పార్టీ కానీ గ్రేటర్ పీఠాన్ని కైవశం చేసుకున్న పక్షంలో తాను చెవి కోసుకుంటానని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ సీట్ల గెలుపు విషయంలో రాజీనామా సవాళ్లను నేతలు సంధిస్తే.. అందుకు భిన్నంగా నారాయణ మాత్రం చెవి కోసుకుంటానంటూ కొత్త తరహా సవాళ్లు విసరటం ఏమిటో..? మరి నారాయణ లాంటి నేతలు చేస్తున్న తాజా సవాలు విషయంలో తెలంగాణ అధికారపక్ష నేతలు ఎలా రియాక్ట్ అవుతారో..?