Begin typing your search above and press return to search.

బరితెగింపు; మిమ్మల్నే తగలబెడితే అని అనేస్తున్నాడు

By:  Tupaki Desk   |   17 March 2015 4:47 AM GMT
బరితెగింపు; మిమ్మల్నే తగలబెడితే అని అనేస్తున్నాడు
X
సీపీఐ నారాయణకు నోటి దురుసుతనం కాస్త ఎక్కువే. ఇష్టారాజ్యంగా మాట్లాడే నేతల్లో ఆయన ఒకరు. తాను మాట్లాడే మాటల్లో హుందాతనం ఉండాలని.. సంద్రాయరాజకీయాలకు ప్రతీకగా ఉండాలనే మాటకు బిన్నంగా ఆయన వ్యవహరిస్తుంటారు.

రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆయన వ్యవహరించిన తీరు తెలిసిందే. అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని ముక్కలు చేయాలన్న తన కాంక్షను ఆయన దాచుకునే ప్రయత్నం చేయలేదు. విభజన కారణంగా ఏపీకి జరిగే అన్యాయాన్ని ప్రశ్నించింది లేదు. ఒకరికి న్యాయం చేసే క్రమంలో మరొకరికి అన్యాయం చేస్తారా? అని ఎలుగెత్త లేదు సరికదా.. సీమాంధ్ర కూడా రెండు ముక్కలు కావాల్సిందేనంటూ తమ విభజన రాజకీయాల్ని ప్రదర్శించారు.

విభజన కారణంగా ఏపీ సర్కారుకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని పట్టని నారాయణ లాంటి వారు ఏదో ఒక ఉద్యమంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టటమే ధ్యేయంగా అడుగులేస్తున్నారు. తాజాగా అంగన్‌వాడీల హక్కుల గురించి పోరాడుతున్న వారు.. తాజాగా ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున అంగన్‌వాడీలతో వారి హక్కుల కోసం అంటూ హల్‌చల్‌ చేయాలని ప్రయత్నిస్తున్నారు.

దీనికి వామపక్ష నేతలు రాఘవులు.. నారాయణ లాంటి వారు కలిసి పోరాటం చేస్తున్నారు. ఇదే కాంబినేషన్‌ ఏపీ విభజన సమయంలో నోరు మూసుకొని ఎందుకు ఉన్నట్లు అని ఎర్ర జెండాలు పట్టుకొని తిరుగుతున్న సీమాంధ్రులు వారిని నిలదీయటం లేదు.

ఇదిలా ఉంటే.. ఛలో అసెంబ్లీకి ప్రయత్నిస్తున్న వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు స్టార్ట్‌ చేశారు. ఆందోళనతో పార్టీని బతికించుకోవాలన్న ఆశను తుంచేసేలా పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై నారాయణకు పట్టరాని కోపం వచ్చేసింది.

అంతే.. వెనుకాముందు చూసుకోకుండా వివాదాస్పద వ్యాఖ్యల్ని చేసేశారు. ముఖ్యమంత్రి దిష్టిబమ్మ దగ్థం చేశారని కేసులు పెడుతున్నాని.. మరి.. ఏకంగా మిమ్మల్నే తగలబెడితే ఏం చేస్తారంటూ బరితెగింపు మాటల్ని మాట్లాడేశారు. ఇలాంటి మాటలు దేనికి నిదర్శనం. ఇలాంటి మాటలు విని.. హింసకు పాల్పడే వారికి నారాయణ బాధ్యత వహిస్తారా? బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్న ఇలాంటి నేతలపై కేసులు ఎందుకు పెట్టకూడదు..?