Begin typing your search above and press return to search.
ఎన్నికలంటే చికెన్ తినటమా నారాయణ?
By: Tupaki Desk | 4 Jan 2020 11:39 AM GMTఏపీలో ప్రభుత్వం కొలువు తీరి తొమ్మిది నెలలు కూడా కాలేదు. అప్పుడే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న రొద అంతకంతకూ పెంచేస్తూ హడావుడి చేస్తున్నారు విపక్ష నేతలు. ఏపీ రాజధానిని మూడు చోట్ల ఏర్పాటు చేసే అంశం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ..నిరసన నిర్వహిస్తున్న ఏపీ విపక్షాలు చేస్తున్న డిమాండ్లు వింటుంటే నవ్వు రాక మానదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బాలజీ సెంటర్ లో ఏర్పాటు చేసిన జేఏసీ అధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా అందరి చూపు తమ మీద పడేలా కొత్త తరహా నిరసనల్ని చేపట్టారు. నాది కర్నూలు జిల్లా నా రాజధాని అమరావతి అంటూ కొందరు ప్లకార్డులు పట్టుకోవటం.. వివిధ జిల్లాల వారు అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్ తెచ్చేలా నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో టీడీపీ.. జనసేనతో పాటు వామపక్షాలు.. ప్రజా సంఘాల వారు పాల్గొన్నారు. సీపీఐ నారాయణ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కులాలు.. మతాల వారీగా జగన్ ఉప ముఖ్యమంత్రుల్ని నిర్వహించారని.. మూడు రాజధానులు చేయాలంటే జగన్ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ పేరుతో అమరావతిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని తప్పు పట్టారు. రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగి ఉంటే.. అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
అవినీతిని సాకుగా చూపించి రాజధానిని తరలించొద్దని నారాయణ డిమాండ్ చేశారు. కామ్రేడ్ మాటలు బాగున్నట్లు కనిపించినా.. కాస్త లాజిక్ గా ఆలోచిస్తే.. పెద్ద మనిషి మాటల్లోని సిత్రాలు కనిపిస్తాయి. ప్రభుత్వానికి భారీ మెజార్టీని కట్టబెట్టిన తర్వాత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవటం మామూలే. అలా నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ లో అర్థం లేదు. ఆ మాటకు వస్తే.. కేంద్రంలోని మోడీ సర్కారు ఇప్పటికి ఎన్నిసార్లు రాజీనామా చేసి.. ఎన్నికలకు వెళ్లాలి?
అయినా.. ఎన్నికలకు వెళ్లటం అంటే చికెన్ ముక్క తిన్నంత ఈజీనా నారాయణ? దానికెంత ఫార్సు ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్న నారాయణ లాంటి వారు సైతం చిన్న పిల్లాడి మాదిరి ఎన్నికలకు పట్టుబట్టటం ఏమిటి? అన్నది ప్రశ్న. ప్రభుత్వం కొలువు తీరి ఏడాది కాక ముందే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చూడటం చూస్తే.. నారాయణ మాష్టారికి జగన్ ప్రభుత్వం ఎందుకంత నిప్పులు చెరుగుతున్నట్లు? అన్న సందేహం కలుగక మానదు.