Begin typing your search above and press return to search.
ఒక్క దెబ్బకు ముగ్గురిని ఏకేసిన నారాయణ
By: Tupaki Desk | 10 Dec 2016 10:13 AM GMTసమకాలీన రాజకీయ నేతల్లో చురుకు పుట్టించే విమర్శలు చేసే దమ్మున్న తెలుగు నేత ఎవరైనా ఉన్నారంటే అది సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణే. ఆయన నోరు విప్పితే ఎవరినైనా ఏమైనా అనగలరు. అలా అని కేసుల చిక్కులు తెచ్చుకున్నా ఏమాత్రం వెనక్కు తగ్గరు. తాజాగా ఆయన ఒకే ప్రెస్ మీట్లో తమిళనాడు దివంగత సీఎం జయలలిత, ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు కురిపించారు. పోయినోళ్లంతా మంచోళ్లన్న ఉద్దేశంతో దివంగత నేతల జోలికి ఎవరూ వెళ్లరు కానీ, నారాయణ అలా కాదు.. జయలలిత మరణించిన మూడ్రోజుల్లోనే ఆయన ఆమె అవినీతిపై విమర్శలుచేశారు. జయ జీవితాన్ని చూసైనా నేతలు నీతిగా బతకడానికి ప్రయత్నించాలంటూ అన్యాపదేశంగా ఆమెకు పట్టిన గతిని ఎత్తి చూపారు.
అంతేకాదు... జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలు రక్తికడుతున్నాయని నారాయణ అన్నారు. పనిలో పనిగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా విమర్శించారు. హిట్లర్ కూడా మోడీలా జాతీయ సంపదను వేస్ట్ చేయలేదని.. మోడీని మించిన నియంత లేరని విమర్శించారు. నోట్ల రద్దు ఓ అనాలోచిత నిర్ణయమని చెప్పారు. రాజకీయ అవినీతిని రూపమాపకుండా... నల్లధనాన్ని అరికట్టడం అసంభవమని చెప్పారు.
ఆ తరువాత చంద్రబాబుపై బాణాలు సంధించారు. వరుస టెలికాన్ఫరెన్సులతో బ్యాంకు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు చంపుతున్నారని నారాయణ అన్నారు. మాటలు ఎక్కువ చెబుతూ, పని తక్కువగా చేస్తున్నారంటూ చంద్రబాబుపై సెటైర్ వేశారు.