Begin typing your search above and press return to search.
గవర్నరును బఫూన్ ని చేసిన సీపీఐ నారాయణ
By: Tupaki Desk | 22 Jan 2018 2:15 PM GMTఏ ముహూర్తంలో కేసీఆర్ ను పొగిడారో కానీ, అప్పటి నుంచి తెలుగు రాష్ర్టాల గవర్నరు నరసింహన్ పై ఒకటే విమర్శలు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆచితూచి మాట్లాడాల్సిన ఆయన పరిధి దాటి ప్రభుత్వాధినేతను భుజానికెత్తుకోవడంతో విపక్షాలు ఆయనపై మండిపడతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడగా తాజాగా సీపీఐ నేత నారాయణ కూడా విరుచుకుపడ్డారు. ఆయన గవర్నరును ఏకంగా బఫూన్ తో పోల్చారు.
బుర్రలో ఏమనిపిస్తే అది మాట్లాడే సీపీఐ నేత నారాయణ గవర్నరు విషయంలో కూడా అదే తరహాలో మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన గవర్నరు తీరును ఎండగట్టారు. పనిలో పనిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పై నా ఆయన విమర్శలు చేశారు. అయితే.. గవర్నర్ నరసింహన్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. గవర్నర్ ఒక బఫూన్ లా మారారని నారాయణ ఎద్దేవాచేశారు.
గవర్నరు నరసింహన్ టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తి...గవర్నర్ వ్యవస్థకే కళంకం తీసుకువచ్చారని నారాయణ అన్నారు. కాగా ఇంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా గవర్నరుపై మండిపడిన సంగతి తెలిసిందే. గవర్నరును కేసీఆర్ కేబినెట్లోకి తీసుకోవాలని ఒకరంటే.. ఆయనకు భజన శాఖ కేటాయించాలని మరొకరు వెటకారమాడారు. మరోవైపు ఏపీకి చెందిన బీజేపీ నేతలు కూడా గవర్నరు తీరును ఎండగడుతున్నారు. ఆయన కేసీఆర్ ప్రభుత్వంపై చూపిస్తున్న ప్రేమ.. ఏపీకి సంబంధించిన ఏ అంశంలోనూ చూపించడం లేదని ఏపీ బీజేపీ నేతలు హరిబాబు - విష్ణుకుమార్ రాజు వంటివారు ఇటీవల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.