Begin typing your search above and press return to search.

మూడు కోతుల మాటలేంటి నారాయణ?

By:  Tupaki Desk   |   24 Jan 2016 5:32 AM GMT
మూడు కోతుల మాటలేంటి నారాయణ?
X
గత కొద్దికాలంగా విమర్శలు చేసేందుకు అవకాశం రాక కామ్ గా ఉంటున్న సీపీఐ సీనియర్ నేత నారాయణ తాజాగా చేసిన వ్యాఖ్య మంట పుట్టిస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఉదంతంపై రియాక్ట్ అవుతూ.. ఈ అంశంపై ప్రధాని మోడీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై చెలరేగిపోయారు. కోతులంటూ నోరు పారేసుకున్నారు.

ప్రధాని మోడీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముగ్గురూ మూడుకోతులుగా నారాయణ విమర్శలు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపిన సందర్భంగా ముగ్గరు నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజెత్తారు. మోడీ.. చంద్రబాబు.. కేసీఆర్ లు ముగ్గురూ ముడు కోతులని.. వారికి చెడుకనిపించదు.. వినిపించదా? అంటూ ప్రశ్నించారు. ఈ ముగ్గరు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే వర్సటీకి రావటం లేదన్న ఆయన.. మోడీ.. చంద్రబాబు.. కేసీఆర్ లకు పక్షవాతం వచ్చిందా? యూనివర్సటీకి ఎందుకు రాలేదంటూ చెలరేగిపోయారు.

రోహిత్ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టే కేసీఆర్ స్పందించలేదన్న నారాయణ.. ఆంధ్రా విద్యార్థి అక్కర్లేదు కానీ.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓట్లు మాత్రం కావాలా? అంటూ గ్రేటర్ ఎన్నికల అంశాన్ని నారాయణ ప్రస్తావించారు. ఘాటైన పదాల్ని విమర్శలుగా సంధించే నారాయణ నోటి వెంట వచ్చిన తిట్లపై ఆయా పార్టీ నేతలు మండి పడుతున్నారు.