Begin typing your search above and press return to search.
మోడీ ఏపీ టూర్‌పై సీపీఐ నారాయణ కామెంట్స్ ఇవే!
By: Tupaki Desk | 14 Nov 2022 5:42 AM GMTతాజాగా ఏపీలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. చాలా వ్యూహాత్మకంగా, అంతే చాకచక్యంగా వ్యవహరిం చారనే చర్చ సాగుతోంది. ఏపీకి ఎన్నో చేస్తున్నట్టు.. అన్నీ ఇస్తున్నట్టు ఇచ్చిన కలరింగ్‌లో ప్రారంభించిన ప్రాజెక్టుల్లో ఏ ఒక్కటీ కూడా ఏపీకి ప్రయోజనం తెచ్చేలా లేవు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రాజెక్టులు. అయినా కూడా బారీ ఎత్తున ప్రచారం అయితే చేసుకున్నారు. ఇదిలావుంటే, ఇక, రాజకీయంగా కూడా మోడీ టూర్ ఆసక్తికర పరిణామాల మధ్య సాగింది.
మోడీ ఇంకా విశాఖకు రాకుండానే జనసేన అధినేత పవన్‌కు ఉరుకులు పరుగుల మీద వర్తమానం పంపి రప్పించుకున్నారు. దాదాపు అరగంట చర్చించారు. దీనిపైనా అనేక ఊహాగానాలు వస్తున్నాయి. పవన్‌కు మోడీ ఏం చెప్పారనేది ఆసక్తిగా మారింది. అయితే, దీనిపై సీపీఐ సీనియర్ నాయకుడు నారాయణ ఆసక్తిగా స్పందించారు. ప్రస్తుతం టీడీపీతో పవన్ చేతులు కలపడాన్ని బీజేపీ జీర్ణించుకోలేక పోతోందని.. అందుకే టీడీపీ వైపు పవన్‌కల్యాణ్ వెళ్లకూడదని కోరుకుంటోందన్నారు. ఈ
నేపథ్యంలోనే పవన్‌కల్యాణ్‌కు ప్రధాని ఆహ్వానం పంపారన్నారు. ''టీడీపీ వైపు వెళ్లొద్దు. నువ్వూ నేనూ కలిసే ఉందామని పవన్‌కు ప్రధాని మోదీ హితబోధ చేశారు'' అని నారాయణ చెప్పారు. ఇదే జరిగితే.. అంటే.. జనసేన టీడీపీవైపు వెళ్లకుండా ఉంటే.. టీడీపీ బలహీన పడుతుంది. ఇక, రాజకీయంగా బీజేపీని బలపరచడం, అలాగే టీడీపీని దెబ్బ తీయడం.. బీజేపీ పెద్దలకు సులువు అవుతుంది. అందుకే పవన్‌ను మోడీ ఆహ్వానించారని నారాయణ చెప్పుకొచ్చారు.
జగన్‌పై సటైర్లు..
ఇక, నారాయణ తనదైన శైలిలో వైసీపీ అధినేత జగన్‌పై సటైర్లు వేశారు. జగన్ ఇంగ్లీషు బాగానే మాట్లాడతా రని, కానీ, విశాఖలో ప్రధాని పాల్గొన్న సభలో్ మాత్రం ఆయన అచ్చతెలుగులో ప్రసంగించారని.. దీనివె నుక రీజన్ ఉందని అన్నారు. అదేంటంటే.. తాను చెప్పేది ఏపీ ప్రజలకు అర్ధం కావాలి.. అదేసమయం లో ప్రధానికి అర్థం కాకూడదన్నట్టు జగన్ వ్యవహరించారని నారాయణ భాష్యం చెప్పారు.
తెలుగు ప్రజానీకానికి తాను ఏం అడగానో తెలిసేలా జగన్ మాట్లాడారన్నారు. అలాగే మోడీకి మాత్రం తెలియకూడ దన్నట్టు మాట్లాడారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో తమ మైత్రి రాజకీయాలు, పార్టీలకు అతీతమని జగన్ చెప్పడం పచ్చి మోసమని నారాయణ వ్యాఖ్యానించారు.
వైసీపీకోసమే బీజేపీ
ఏపీలో వైసీపీ బలంగా ఉండాలనేది ప్రధాని ఆకాంక్షగా నారాయణ చెప్పారు. వైసీపీ బలంగా వుంటే కేంద్రంలో తనకు మద్దతు ఇస్తుందని ప్రధాని ఆలోచన అన్నారు. ఇదే సందర్భంలో టీడీపీని బలహీనపర్చాలని ప్రధాని కోరుకుంటున్నారన్నారు. టీడీపీ బలహీనంగా ఉంటే తప్ప ఏపీలో బీజేపీ బలపడదని, ఇదే వ్యూహాన్ని మోడీ పాటిస్తున్నారని అన్నారు. మొత్తానికి నారాయణ విశ్లేషణ ఆసక్తిగా ఉండడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.