Begin typing your search above and press return to search.
నాగార్జున పై సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్
By: Tupaki Desk | 4 Feb 2022 10:51 AM GMTసీపీఐ నారాయణ... ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈయన గురించి తెలియని వాళ్లు లేరు. ప్రజా సమస్యలపై గత కొన్ని దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారాయన. వివాదాస్పద అంశాలపై నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడే సీపీఐ నారాయణ వ్యక్తిత్వం మిగతా రాజకీయ నాయకులతో పోలిస్తే చాలా ప్రత్యేకం. వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలిచిన ఆయన తాజాగా `ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే`లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆంద్ర జ్యోతి ఎండీ రాధాకృష్ఱ అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు అంతే ఆసక్తికరంగా సమాధానాలు చెప్పారు. ఈ సందర్బంగా ఆయన టాలీవుడ్ హీరో నాగార్జునపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా `ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే` ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో ఆయన పలు ఆసక్తికర విషయాలని వెల్లడించారు.
కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగి ఇలా తయారయ్యారేంటీ? అని ఆర్కే అడిగిన ప్రశ్నకు `ఇస్త్రీ బట్టలు వేసుకోకూడదు.. తెగిపోయిన చెప్పులు వేసుకోవాలి. గడ్డం పెంచాలి.. అప్పుడు వాడు నిజమైన కయ్యూనిస్టు అంటారు. కానీ అది భ్రమ. చినజీయర్ స్వామి మొదలుకుని రకరకాల వాళ్లు కూడా మాకూ కమ్యూనిస్టు భావాలున్నాయని చెప్పేవారున్నారని బదులిచ్చారు సీపీఐ నారాయణ.
అంతే కాకుండా అసలు కమ్యూనిస్టులు అంటే ఇప్పటి తరానికి ఎవరు అనే పరిస్థితి వచ్చిందని, అయితే అసలు సిసలైన కమ్యూనిస్టులెవరు? వాళ్లు ఎలా వుండాలి? వంటి ఎన్నో ఆసక్తికర విషయాల్ని ఈ షోలో వెల్లడించారు. ఈ సందర్భంగా అంతా సరదాపడుతున్న బిగ్బాస్ హౌస్ ని మీరు బ్రోతల్ హౌస్ అని ఎందుకు అన్నారని ఆర్కే ప్రశ్నించారు. దీనికి సీపీఐ నారాయణ చెప్పిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అంతే కాకుండా బిగ్బాస్ షో, ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించిన హీరో అక్కినేని నాగార్జునపై షాకింగ్ కామెంట్ లు చేశారు.
`ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావ్?.. ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావ్..?. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావ్?.. అనేది బిగ్బాస్ షోనా..అని ఆగ్రమాన్ని వ్యక్తం చేశారు నారాయణ .. ఈ సందర్భంగా ఆర్కే .. నాగార్జున అంటే సీరియస్ గా కోపమా? అని అడిగితే .. `తనంటే కోపం కాదు అసహ్యం అంటూ షాకింగ్ కామెంట్ లు చేశారు సీపీఐ నారాయణ. అయితే నాగార్జున పై ఆయన నిజంగానే అలా అన్నారా? లేక ప్రోమోలో అలా అన్నట్టుగా కట్ చేశారా? అన్నది ఆదివారం రాత్రి 8:30 గంటలకు పూర్తి ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది.