Begin typing your search above and press return to search.

మోడీని వంద‌సార్లు కాల్చేసిన త‌ప్పులేదు

By:  Tupaki Desk   |   10 Aug 2016 10:53 AM GMT
మోడీని వంద‌సార్లు కాల్చేసిన త‌ప్పులేదు
X
వివాదాస్పద వ్యాఖ్యలు చేయ‌డంలో ముందుండే సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మ‌రోమారు త‌న‌దైన శైలిలో ర‌చ్చ మొద‌లుపెట్టారు. హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ద‌ళితులపై దాడి చేయాలనుకుంటే తనపై తుపాకి దాడి చేయాలని పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. దీనిపై స్పందించిన నారాయ‌ణ ఘాటుగా రియాక్ట‌య్యారు. ఎన్డీఏ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి దళితులపై చేసిన దాడులకు మోడీని వందసార్లు షూట్ చేసినా చాలదని అన్నారు. దళితులపై మోడీది కపటప్రేమ అని పేర్కొంటూ అందుకే ఒక్కసారి కాదు వందసార్లు తుపాకులతో కాల్చాలని ఆయ‌న మండిపడ్డారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో మోడీకి ద‌ళితులు గుర్తుకు వ‌చ్చినట్లున్నార‌ని విమ‌ర్శించారు.

ఇదిలాఉండ‌గాప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఆర్పీఎఫ్ జవాను పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన సీఆర్పీఎఫ్ దళం తెరచిన ఓ వెబ్ సైట్ కు నరేంద్ర మోడీ దరఖా స్తు అందింది. తీరా ఆరా తీస్తే... ఈ దరఖాస్తు ఓ సైబర్ నేర గాడి పని అని తేలింది. గుర్తు తెలియని ఓ దుండగుడు సీఆర్పీఎఫ్ ఉద్యోగానికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేస్తూ సదరు దరఖాస్తులో అభ్యర్థి పేరు కాలమ్ లో నరేంద్ర మోడీ పేరు రాసి, ఫొటో పేస్ట్ చేయాల్సి ఉన్న ప్రదేశంలో మోడీ ఫొటోనే పెట్టేశాడు. ఈ దరఖాస్తు చూసి షాక్ తిన్న సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు వెనువెంటనే దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీ సులు ఈ దరఖాస్తును అప్ లోడ్ చేసిన సైబర్ నేరగాడి కోసం వేట మొదలుపెట్టారు.