Begin typing your search above and press return to search.
అగ్రనేత మాటః పవన్ ఓ శిఖండి
By: Tupaki Desk | 8 Feb 2016 10:13 AM GMTజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిరంతరం వార్తల్లో వ్యక్తిగా ఉంటారు. సంఘటన ఏదైనా దానితో సంబంధం లేకుండా పవన్‌ను సదరు ఎపిసోడ్‌లోకి దూర్చేయడం ఈ మధ్య కాలంలో కామనైపోయింది. తాజాగా ఏపీలో హాట్‌టాపిక్‌గా మారిన కాపుల రిజర్వేషన్ అంశంలో ఇదే తరహా సీన్‌లు జరిగాయి. కాపులు తమ డిమాండ్ ను తెరమీదకు తేవడం, ఆస్తుల ధ్వంసానికి పాల్పడటం, కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్షకు దిగడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు రంగంలోకి దిగన పవన్ వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అయితే పవన్ కళ్యాణ్ పాత్రపై సీపీఐ అగ్రనేత నారాయణ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కాపాడేందుకే పవన్ కళ్యాణ్ తెరమీదకు వస్తుంటారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ శిఖండి పాత్ర పోషిస్తున్నారని ఆక్షేపించారు. కాపులకు రిజర్వేషన్ విషయంలో చంద్రబాబు స్పందిస్తున్న తీరు సరికాదని అసలు కుల రాజకీయాలకు ఆధ్యుడు చంద్రబాబేనని విమర్శించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ ద్వారా వారికి కోటా కల్పించాలని నారాయణ కోరారు.
కాపుల ఉద్యమం వల్ల పరిస్థితులు చేజారకుండా చూసే క్రమంలో పవన్ కళ్యాణ సూచన చేయడం, ప్రభుత్వం చర్చల నేపథ్యంలో దీక్ష విరమణ జరిగితే దానికి పవన్ ను శిఖండితో పోల్చి మరీ కామెంట్ చేయడం....నారాయణకే చెల్లిందేమో! మొత్తంగా స్పందిస్తే అతి జోక్యం చేసుకున్నారని, తన పనిలో తానుంటే అస్సలే పట్టించుకోవడం లేదంటూ విమర్శలను ఎదుర్కోవడం పవన్‌కు అలవాటుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.