Begin typing your search above and press return to search.
వెంకయ్యను ఫ్యాంట్లు వేసుకోమంటున్న నారాయణ
By: Tupaki Desk | 25 March 2016 5:14 AM GMTనోటి దురుసు నేతలు ఈ మధ్యన ఎక్కువగా ఉండటం మామూలే. మామూలుగానే నోటి దురుసు ఎక్కువగా ఉండే సీపీఐ సీనియర్ నేత నారాయణ లాంటి వ్యక్తికి ఆగ్రహం వస్తే మాటలుఎంత తీవ్రంగా ఉంటాయన్నది తాజాగా ఆయన చేసిన ప్రసంగం వింటే విస్మయం చెందాల్సిందే. ఎంత ఆగ్రహం ఉంటే మాత్రం మరీ అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం ఏమిటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థి నేత కన్నయ్య సభలో మాట్లాడిన నారాయణ.. చుట్టూ చేరిన కార్యకర్తలు.. అభిమానుల్ని చూసి పరవశించి పోయిన ఆయన ఒళ్లు పై తెలీకుండా మాట్లాడేయటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సభలకు హాజరయ్యేటప్పుడు ఫ్యాంటు వేసుకొని రావాలని.. పంచెలతో వస్తే.. పంచలూడదీసి జనం కొడతారంటూ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
సీనియర్ నేతగా వ్యవహరించే నారాయణ లాంటి నేత.. మాట్లాడే మాటలు హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది. బరితెగింపుతోనే రాజకీయ మైలేజీ పొందాలనుకోవటం సరికాదు. ఆ ప్రయత్నం లేనిపోని ఉద్రిక్తతలకు దారి తీయటమే కాదు.. చెడు సంస్కృతికి తెర తీస్తుందన్న విషయం నారాయణ గుర్తించి.. నోటిని అదుపులో ఉంచుకుంటే మంచిదన్న మాట పలువురు చేస్తున్నారు. ఇలాంటి సూచనలు నారాయణ లాంటి నేతల తలకెక్కుతాయా?