Begin typing your search above and press return to search.
అతడు యుద్ధం చేయటానికి రాలేదంట
By: Tupaki Desk | 23 March 2016 4:43 PM GMTజేఎన్ యూ విద్యార్థి కన్నయ్య కుమార్ తాజాగా హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో.. అతని తల్లిని పరామర్శించుందకు కన్నయ్య రావటం.. ఈ సందర్భంగా పోలీసులు ఆయన్ను వర్సటీలోకి వెళ్లకుండా అడ్డుకోవటం తెలిసిందే.
తాజా పరిణామాలపై సీపీఐ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నారాయణ స్పందించారు. రోహిత్ తల్లిని పరామర్శించటానికి మాత్రమే కన్నయ్య వచ్చారని.. అతడేమీ యుద్ధం చేయటానికి రాలేదని వ్యాఖ్యానించారు. కన్నయ్యను రావటం చూసి కేంద్రం భయపడుతోందని ఎద్దేవా చేశారు. వర్సిటీలోకి వెళ్లకుండా కన్నయ్యను పోలీసులు అడ్డుకోవటం దారుణంగా ఆయన అభివర్ణించారు.
నిరసనల పేరుతో.. వీసీ అతిధిగృహం మీదా.. పోలీసులు.. మీడియా మీద దాడి చేసిన వర్గానికి వత్తాసుగా వచ్చిన నారాయణ.. మంగళవారం నాటి దాడి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? పోలీసులు చేసిన లాఠీ ఛార్జి గురించి తెగ బాధపడి పోతున్న నారాయణ.. పోలీసుల చర్యకు ముందు.. పోలీసుల్ని రాళ్లతో గాయపర్చటం.. వీసీ అతిధిగృహంలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేయటం లాంటి చట్టవ్యతిరేక పనులకు నారాయణ లాంటి నేతలు రియాక్ట్ కాకపోవటం చూస్తే.. వారెంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. ఇలాంటి వారిని ప్రోత్సాహించాలా? కన్నయ్య యుద్ధం చేయటానికి రాకుంటే.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో తన పర్యటనను రద్దు చేసుకొని ఉండొచ్చుగా..?