Begin typing your search above and press return to search.
బాబు ఖాళీ చేతులతో వస్తే గుండు కొట్టిస్తారట
By: Tupaki Desk | 4 Aug 2016 4:53 PM GMTసంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరయిన సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మరోమారు అదే తరహాలో కామెంట్లు చేశారు. ఈ దఫా ఆయన ఏపీ ప్రత్యేక హోదా - సీఎం చంద్రబాబు పర్యటనపై మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఖాళీ చేతులతో వస్తే గుండు కొట్టిస్తామని హెచ్చరించారు. ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటన చేయించుకొని వస్తే కృష్ణా నదిలో ముంచి లేపి సన్మానం చేయిస్తామని ప్రకటించారు. అయితే ప్రత్యేక హోదా కోసం ఎవరినీ యాచించనవసరం లేదని, అది ఏపీ ప్రజల హక్కు అని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఏపీలో అందరూ ప్రత్యేక హోదా పై ఏం జరుగుతుందోనని ఢిల్లీ వైపు చూస్తున్నారని, అయితే దీనిపై ఇంత కసరత్తు - ఇన్ని నాటకాలు ఆడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా లోక్ సభలో హడావుడిగా పొందుపర్చిన బిల్లులో ప్రత్యేక హోదా అంశం లేకపోవడంతో, ఆనాడు రాజ్యసభలో స్వయానా ప్రధానిచే హామీ ఇప్పించారని నారాయణ గుర్తు చేశారు. నాటి ప్రధాని మన్మోహన్ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ప్రకటించగా, ఆనాటి ప్రతిపక్ష నేత వెంకయ్యనాయుడు 10 ఏళ్ళు కావాలని డిమాండ్ చేశారన్నారు. అంతేగాక తన వల్లే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చిందని ఊరూరా ప్రచారం - సన్మానాలు చేయించుకోవడం - బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాలను వెంకయ్య మర్చిపోయారా అంటూ నారాయణ ప్రవ్నించారు. గత రెండు సంవత్సరాలుగా హోదా హామీని అమలు చేయకపోగా - హోదా విభజన బిల్లులో పేర్కొనలేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. వెంకయ్యది నోరా? తాటిమట్టా ? అని నారాయణ విమర్శించారు. 14వ ఆర్థిక సంఘం అనుమతి లేదని చెప్పడం విడూరంగా వుందన్నారు. అదేమైనా రాజ్యాంగానికి అతీతమైన వ్యవస్థా ? అని ఆయన ప్రశ్నించారు. ఏదైనా పార్లమెంటు పరిధికి లోబడి వున్నవేనని, పైగా అన్ని పార్టీలు సమర్ధించినందున కేంద్రం తక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇప్పుడు ప్యాకేజీ అంటూ కొత్త పాట పాడుతున్నారని, ప్రత్యేక హోదాను యాచించడం లేదని అది ఏపీ హక్కు అన్న విషయం కేంద్రం గుర్తు ఎరగాలని నారాయణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నాటకాలకు తెరదించాలని, ఢిల్లీ వెళ్ళి ఒంటరిగా ప్రధానిని కలవకుండా పార్లమెంటులో మద్దతు తెలిపిన 11 పార్టీల నేతలతో వెళ్ళి ప్రత్యేక హోదా పై ప్రకటన చేయించాలని నారాయణ డిమాండ్ చేశారు. అది చంద్రబాబు రాజకీయ బాధ్యత అని నారాయణ పేర్కొన్నారు. అలా కాకుండా మళ్ళీ ఆయన ఒక్కరే వెళ్ళి ప్రధానితో గుసగుసలాడితే జనం ఇద్దర్నీ నమ్మేపరిస్థితిలో లేరన్నారు. ప్రత్యేక హోదా అంశం చంద్రబాబు సొత్తు కాదని, అది రాష్ట్ర ప్రజా సమస్య అన్నారు. ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదా సాధించుకొస్తే తామే సన్మానం చేస్తామన్నారు. అన్నింటా కేంద్రం చోరవైఫల్యం అన్నిరంగాల్లో కేంద్రం ఘోర వైఫల్యం చెందిందని నారాయణ విమర్శించారు. ప్రభుత్వ విధానాలు కార్పోరేట్లకు, వ్యాపారులకు అనుకూలంగా వున్నాయని, ఫలితంగా నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయన్నారు. దీనిపై ఈనెల 17వ తేదీ దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతామని నారాయణ ప్రకటించారు.