Begin typing your search above and press return to search.
బీజేపీ అలా చేసి తీరుతుందంటున్న నారాయణ!
By: Tupaki Desk | 20 Jan 2015 9:09 AM GMTనారాయణ అంటే సార్వత్రిక ఎన్నికల ముందు వరకూ సీపీఐ నారాయణే గుర్తుకొచ్చేవాడు. అయితే ఇప్పుడు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తన హడావుడితో ఆ స్థానాన్ని ఆక్రమించేశాడు. సీపీఐ నారాయణను మరిపించేశాడు. కానీ అప్పుడప్పుడు మాత్రం కమ్యూనిస్టు నారాయణ మీడియాలో హడావుడి చేస్తున్నాడు. తాజాగా తనదైన శైలి వ్యాఖానంతో సీపీఐ నారాయణ మీడియా ముందుకు వచ్చాడు.
తెలుగుదేశం అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కో జంటా ఇద్దరేసి ముగ్గురేసి పిల్లల్ని కని దేశ జనాభాను పెంచేయాలని ఇచ్చిన పిలుపుపై సీపీఐ నారాయణ స్పందించాడు. బాబు హరికథలో ఉల్లిపాయ శాస్త్రం చెప్పినట్టుగా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తిన నారాయణ బాబు ఇలా మాట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీని కాకా పట్టడానికే అని కూడా తేల్చేశాడు.
అంతేకాదు రాజకీయ భవిష్యత్తుపై కూడా నారాయణ ఒక ఆసక్తికరమైన జోస్యాన్ని చెప్పాడు. బాబు భారతీయ జనతా పార్టీని ఎంతగా కాకా పట్టినా ప్రయోజనం ఉండదని.. వచ్చే ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశానికి కచ్చితంగా గోతులు తవ్వుతుందని నారాయణ తేల్చేశాడు!
మరి ఈ గోతులు తవ్వడం ఏమిటంటే... బహుశా ఏపీలో భారతీయ జనతా పార్టీ బలపడానికి వేసే ఎత్తులను ఉద్దేశించే నారాయణ ఈ 'గోతులు తవ్వడం' అనే మాటను ఉపయోగించాడేమో. ఏదేమైనా నారాయణ విమర్శలు మాత్రం సెటైరిక్‌గా ఉన్నాయని చెప్పకతప్పదు.