Begin typing your search above and press return to search.
రాజకీయాలకు చండీయాగానికి లింకేంటో..?
By: Tupaki Desk | 3 Jan 2016 5:55 AM GMTవ్యక్తిగత నమ్మకాలు వేరు. రాజకీయాలు వేరు. ఈ రెండింటిని కలపాల్సిన అవసరమే లేదు. కానీ.. ఈ రెండింటిని లింకెట్టి మరీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు సీపీఐ నేత నారాయణ. పూజలు.. పునస్కారాలు.. దేవుడు లాంటి వాటిని ఏ దశలోనూ లెక్కలోకి తీసుకొని నారాయణ లాంటి అపర కమ్యూనిస్టులు.. కేసీఆర్ చేపట్టిన చండీయాగం మహత్తును ప్రస్తావించటం ఏమిటో ఆయనకే తెలియాలి.
మహత్తర చండీయాగాన్ని నిర్వహించి నిజాయితీగా ఉండకుండా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకున్నా.. డబ్బుతో గెలిచేశారంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. పూజలు చేసినంత మాత్రాన మడికట్టుకొని కూర్చోవాలా? ఒకవేళ అదే నిజమైతే.. తమ వామపక్ష వాదం తప్పించి ప్రపంచంలో మరే వాదం సరికాదన్నట్లుగా మాట్లాడే కామ్రేడ్ లు తమ మైండ్ సెట్ ను ఎందుకు మార్చుకోరు. దేవుళ్లు.. పూజలు చేసేది వ్యక్తిగత లబ్ధి కోసమే తప్పించి.. ప్రత్యర్థి రాజకీయ పార్టీలను బతికించేందుకు కాదు కదా. అయినా.. రాజకీయం లాంటి రంగంలో ఉంటూ విలువల గురించి మాట్లాడు ఏంటి?
నిజానికి నారాయణ బాధ అంతా ఖమ్మం సీటును కోల్పోవటం మీదనే. తమకు మాంచి పట్టున్న ఖమ్మంలాంటి చోట.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పక్కాగా గెలిచే అవకాశం ఉంది. కానీ.. కేసీఆర్ మంత్రాంగం పుణ్యమా అని కరుడుగట్టిన కమ్యూనిస్టులు సైతం కారెక్కిన పరిస్థితి. ఇలాంటివి ఊహించని నారాయణకు.. ఖమ్మం ఫలితం షాకింగ్ గా మారింది. దీంతో.. తెలంగాణ అధికారపక్షంపై ఆయన ఎడాపెడా విమర్శలు చేసేస్తున్నారు.
తెలంగాణ అధికారపక్షానికి తగి బలం లేకున్నా.. స్థానిక ప్రజాప్రతినిధులను లోబరుచుకుని.. వారి సాయంతో సీట్లను గెలుచుకుందంటూ నారాయణ విమర్శిస్తున్నారు. అయినా.. మనం బంగారం మంచిదైతే కంసాలి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుందా? అధికారపార్టీకి లోబడిపోయిన వారిని తిట్టకుండా.. తెలంగాణ అధికారపక్షాన్ని తిట్టటంలో అర్థమేమైనా ఉందా కామ్రేడ్..?