Begin typing your search above and press return to search.
మోడీని కాల్చి పారేసినా పాపం లేదు!
By: Tupaki Desk | 28 Nov 2016 4:39 AM GMTసంచలన విమర్శలకు పెట్టింది పేరయిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోమారు తన వాగ్దాటిని ప్రదర్శించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించిన నారాయణ ఈ సందర్భంగా పరుష పదాలు వాడారు. ప్రధానమంత్రి మోడీ సర్కార్ కార్పొరేట్ల లబ్ధి కోసమే పని చేస్తోందని, ప్రత్యామ్నాయం చూపించకుండా నోట్లను రద్దు చేయడం అత్యంత క్రూరమైన చర్యని నారాయణ ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కనీస అవగాహన లేకుండా పెద్దనోట్లను రద్దు చేసిన ప్రధాని హిట్లర్ కంటే ప్రమాదకారి అని అన్నారు. ఇలాంటి ప్రధాని భవిష్యత్ లో కూడా దేశం చూడదని - కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న ప్రధానిని వంద సార్లు కాల్చినా తప్పులేదని నారాయణ వ్యాఖ్యానించారు.
నోట్ల రద్దుపై ప్రజలు ఇచ్చిన సూచన మేరకు ఆక్రోశ దినంగా బంద్ పాటిస్తున్నామని, ఈ బంద్ లో బ్యాంకులకు మినహాయింపు ఉందని నారాయణ స్పష్టం చేశారు. మోడీ కార్పొరేట్లకు రూ.4 వేల కోట్లు రద్దు చేశారని, దేశంలో ఉన్న నల్లధనం బయటకు తేవడానికి ప్రజలందరిపై శిక్ష వేయక్కర్లేదన్నారు. ప్రజలు యాభై రోజులపాటు సహకరించాలని ప్రధాని మోడీ కోరుతున్నారని, వారి కోసం ప్రధానమంత్రి యాభై రోజుల పాటు భోజనం మానేయగలరా అని డిమాండ్ చేస్తున్నామన్నారు. నల్ల కుబేరుల మేలు కోసం మోడీ చర్యలు చేపట్టారని నారాయణ ఆరోపించారు. నకిలీ నోట్లను అరికట్టలేక ప్రజలపై ఇటువంటి ప్రయోగాలు చేయడం చాలా దారుణమని, భారతదేశ చరిత్రలో ఇటువంటి ప్రధాని ఎవరూ లేరని ఆరోపించారు. కార్పొరేట్ల ఉప్పు తింటున్న మోడీ, వారి రుణం తీర్చుకుంటున్నారన్నారు. అనేక సంస్థలకు వేల కోట్లు దోచిపెట్టారని నారాయణ ఆరోపించారు. పరిమిత వ్యక్తులకే నోట్ల రద్దు లీకయిందని విమర్శించారు. పాత నోట్లు చలామణిలో ఉండగానే కొత్త నోట్లు ప్రవేశపెడితే బావుండునని నారాయణ అన్నారు.
ప్రధాని మోడీ నిర్ణయం వల్ల దేశంలో కరెన్సీ దాడులు తప్పవని నారాయణ జోస్యం చెప్పారు. రాష్ట్రానికి రూ.350 కోట్ల అవసరం ఉన్నప్పటికీ కేంద్రం రూ.100 కోట్లు మాత్రమే సరఫరా చేసిందని అందువల ఈ పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. బీజేపీ మంత్రులు, నాయకుల డిపాజిట్లు పరిశీలిస్తే పెద్దనోట్ల రద్దు వ్యవహారం బయటపడుతుందని తెలిపారు. పెద్దనోట్ల రద్దు చేసిన తేదీ నుంచి మూడు నెలల ముందు బీజేపీ నాయకుల ఖాతాలు పరిశీలిస్తే... వారి బండారం బయటపడుతుందని నారాయణ చెప్పారు. నల్ల ధనం పోగేసిన వారిని పక్కన పెట్టుకుని పేదలను ప్రధాని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. మోడీ నిర్ణయం కార్పొరేట్లకు నష్టం కలిగించి ఉంటే ఈపాటికి మోడీ ఇంటికెళ్లి ఉండేవారని చెప్పారు. కార్పొరేట్లకు మోడీ నిర్ణయం లాభం చేకూర్చడం వల్లే ఆయన పదవిలో ఉన్నారని చెప్పారు. మోడీ రెండున్నర ఏళ్లలో కార్పొరేట్లకు రూ.5.80 లక్షల కోట్లు రద్దు చేశారని ఆరోపించారు. ప్రధానిని వెనుకేసుకు వస్తున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిది సినిమాలో అల్లు రామలింగయ్య పాత్రలాంటిదని నారాయణ ఎద్దేవా చేశారు. ప్రధాని నిర్ణయం వల్ల రైతులు, పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు, జన్‌ధన్ ఖాతాల్లో రూ.లక్ష చొప్పున డిపాజిట్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/