Begin typing your search above and press return to search.

విద్యాశాఖ మంత్రి మందు క‌ల‌ప‌టంలో నిపుణుడ‌న్న నారాయ‌ణ‌

By:  Tupaki Desk   |   12 May 2019 5:11 AM GMT
విద్యాశాఖ మంత్రి మందు క‌ల‌ప‌టంలో నిపుణుడ‌న్న నారాయ‌ణ‌
X
ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడ‌లు కావ‌టం కాల మ‌హిమ‌. అలాంటి ప‌రిస్థితి తెలంగాణ‌లో తోపుల్లాంటి నేత‌లెంద‌రో ప్ర‌స్తుతం ఎదుర్కొంటున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్ర‌త్యేక తెలంగాణ కోసం అదే ప‌నిగా డిమాండ్ చేసిన‌ సీపీఐ నారాయ‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన నారాయ‌ణ తెలంగాణ కోసం ఎంతో కోట్లాడారు. అలాంటి నారాయ‌ణ తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న ప‌రిస్థితి ఎంత‌గా మారింద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే.

ఉమ్మ‌డి రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి అపాయింట్ మెంట్ కోసం ఇలా ట్రై చేసిన వెంట‌నే.. అలా వ‌చ్చేది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం గంట‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా రాని విచిత్ర‌మైన అనుభ‌వం నారాయ‌ణ సొంతం. అలా అని కేసీఆర్ తో నారాయ‌ణ‌కు అనుబంధం లేక‌పోలేదు. ఇంకా చెప్పాలంటే.. నాడు కేసీఆర్ చేసిన ఉద్య‌మానికి బ్యాక్ బోన్ లా వ్య‌వ‌హ‌రించిన నారాయ‌ణ గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ దీక్ష చేస్తున్న వేళ త‌న‌ను క‌లిసిన క‌విత‌.. హ‌రీశ్‌.. కేటీఆర్ ఉదంతాన్ని ప్ర‌స్తావించారు.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్న‌ప్పుడు టీఆర్ ఎస్ ముఖ్య‌నేత‌లు కవిత‌.. కేటీఆర్.. హ‌రీశ్ లు క‌లిశార‌ని.. వెంట‌నే ఆయ‌న చేత దీక్ష విర‌మింజేయాల‌ని.. లేకుంటే కేసీఆర్ చ‌నిపోయేలా ఉన్నార‌ని త‌న‌తో చెప్పిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇంట‌ర్ విద్యార్థుల ప్రాణాలు.. కేసీఆర్ లాంటి ప్రాణాలు కావా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. ఇంట‌ర్ విద్యార్థుల మ‌ర‌ణం త‌న‌ను క‌లిచివేసింద‌న్నారు. 1200 మంది విద్యార్థులు చ‌నిపోయిన త‌ర్వాత తెలంగాణ వ‌చ్చింద‌ని.. ఆ త‌ర్వాత విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు జ‌ర‌గ‌వ‌ని కేసీఆర్ చెప్పార‌ని.. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితి ఎలా ఉందో తెలిసింద‌న్నారు.

గాంధీ ఆసుప‌త్రిలో దీక్ష చేస్తున్న వారితో దీక్ష‌ను విర‌మింప‌జేసిన ఆయ‌న‌.. తెలంగాణ విద్యా శాఖామంత్రిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

విద్యాశాఖామంత్రి మందు క‌ల‌ప‌టంలో ఎక్స్ ప‌ర్ట్ అని... ఆయ‌న‌కు విద్యాశాఖ ఎందుక‌ని నారాయ‌ణ చుర‌కేశారు. విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మైన విద్యామంత్రిని వెంట‌నే బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. గ‌తాన్ని గుర్తు చేసుకొని.. త‌న హ‌వా ఎంత న‌డిచింద‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పిన నారాయ‌ణ మాట‌లు బాగానే ఉన్నా.. ఇప్పుడాయ‌న మాట‌ల్ని సీఎం కేసీఆర్ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.