Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌... మురికిగుంటల్లో చేపలు పట్టుకునే లాంటి వాడు: కామ్రెడ్ ఫైర్‌

By:  Tupaki Desk   |   27 Aug 2022 4:51 PM GMT
జ‌గ‌న్‌... మురికిగుంటల్లో చేపలు పట్టుకునే లాంటి వాడు:  కామ్రెడ్ ఫైర్‌
X
ఏపీ సీఎం జ‌గ‌న్‌పై చాలా మంది రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు అనేక విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ఆయ‌న పాల‌న‌పైనా.. కేసుల గురించి.. ఇలా అనేక విష‌యాల‌ను వారు ప్ర‌స్తావిస్తారు. కానీ, క‌మ్యూనిస్టుల స్ట‌యిలే వేరు. అందునా..సీపీఐ సీనియ‌ర్ నాయ‌కుడు.. చికెన్ నారాయ‌ణ స్ట‌యిల్ మ‌రింత డిఫ‌రెంట్‌.

ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ కామెంట్స్‌.. డిఫ‌రెంట్ యాంగిల్‌లో చేస్తుంటారు. తాజాగా త‌న శైలిలో జ‌గ‌న్పై విరుచుకు ప‌డ్డారు. `మురికిగుంటల్లో చేపలు పట్టుకునే లాంటివాడు`-అంటూ.. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

గతంలో హిట్లర్, ముస్సోలిని నియంతలతో పోల్చేవారు. ఇప్పుడు కాలం మారింది. పోలికలు మారాయి. కొత్తగా దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్‌ను నియంతల జాబితాలో చేర్చారు. కిమ్‌ను ఈ జాబితాలో చేర్చడం ఎంతవరకు సమంజసం అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్ ను కిమ్ తో పోల్చారు. `జ‌గ‌న్.. అనేవాడు.. ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్‌కు అన్న‌లాంటి వాడు`` అని కుప్పం ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు.

అయితే.. జ‌గ‌న్ ను ఇలా పోలిక పెట్టడం సీపీఐ నారాయణ కు ఏమాత్రం నచ్చలేదనుకుంటా... చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. జగన్‌కి, కిమ్‌కు మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. అస‌లు.. జ‌గ‌న్‌కు, కిమ్‌కు పోలికే లేద‌న్నారు. కిమ్‌తో పోల్చ‌డం స‌రికాద‌ని కూడా హిత‌వు ప‌లికారు. అమెరికా లాంటి సామ్రాజ్యవాదాన్ని కిమ్ గడగడలాడిం చారని అన్నారు. అయితే.. మురికిగుంటల్లో చేపలు పట్టుకునే జగన్ లాంటి వాళ్లతో కిమ్ ను పోల్చడం సరికాదని తప్పుబట్టారు.

కిమ్ క‌న్నా.. జ‌గ‌న్ దిగ‌జారిపోయార‌ని.. ఆయ‌న‌తో పోల్చి.. కిమ్‌ను త‌క్కువ చేయ‌డం స‌రికాద‌న్నారు. అంతేకాదు.. జ‌గ‌న్ ఖ‌చ్చితంగా మురికి గుంట‌ల్లో చేప‌లు ప‌ట్టుకునేవాడితో పోల్చ‌డ‌మే క‌రెక్ట్ అని కామ్రెడ్ వ్యాఖ్యానించారు. ఇక‌, త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో చంద్రబాబును అడ్డుకోవాలనుకోవడం తగదన్నారు. సంక్షేమ పథకాలు అందిస్తున్నామంటున్న జగన్‌కు భయం ఎందుకు? అని ప్రశ్నించారు. బెదిరించి, భయపెట్టి వైసీపీ పాలన చేయాలనుకుంటోందని విమర్శించారు. హత్యా రాజకీయాలను వైసీపీ ప్రోత్సహిస్తోందని నారాయణ దుయ్యబట్టారు. మొత్తానికి నారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా ఉన్నాయ‌ని అంటున్నారు నెటిజ‌న్లు.