Begin typing your search above and press return to search.
ఫేస్ బుక్ లో ఇరగదీస్తున్న నారాయణ!
By: Tupaki Desk | 10 Oct 2015 4:55 PM GMTఇది మంత్రి నారాయణకు సంబంధించిన గొడవ కాదు. ఒకవేళ మంత్రి నారాయణ ఫేస్ బుక్ లో యాక్టివ్ గా ఉన్నారని అనుకున్నప్పటికీ.. అందులో ఒక లాజిక్ ఉంది. నారాయణ చేతుల మీదుగా ఇప్పుడు అమరావతికి సంబంధించిన సకల కార్యకలాపాలు ప్రాణం పోసుకుంటున్నాయి. అన్నీ తానే అయి ఆ నగర శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వార్త ఆయన గురించి కాదు.. సీపీఐ నారాయణ గురించి! సందర్భాలు వచ్చినప్పుడు ప్రభుత్వాల్ని తూలనాడుతూ.. తతిమ్మా వేళల్లో తన జిహ్వచాపల్యం గురించి మిత్రులతో సరదా కబుర్లు చెప్పుకుంటూ గడిపేసే నారాయణ, జాతీయస్థాయి నాయకుడుగా మారిపోయిన తర్వాత.. మరి మీడియాకు నల్లపూసయిపోయారు. ఎప్పుడో తప్ప కనిపించడం లేదు.
అయితే ఆయన తన వ్యాఖ్యలను, వ్యవహారాలను అభిప్రాయాలను పంచుకోవడానికి సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడుకుంటూ ఉండడం ఇక్కడ ప్రత్యేకత. సీపీఐ నారాయణ వంటి సీనియర్ మరియు సాంప్రదాయ నాయకుడు పైగా టెక్నాలజీని వినియోగించుకోవడంలో కాస్తంత వెనుకవరుసలో ఉండే వామపక్ష పార్టీల ప్రతినిధి .. ఇంత సీరియస్‌గా ఫేస్ బుక్‌ను వాడుకోవడం.. అందులో తన అభిప్రాయాలను మీడియాతో కంటెఎక్కువ నిష్కర్షగా వ్యక్తం చేస్తూ.. విచ్చలవిడిగా ఆడుకుంటూ ఉండడం ఇక్కడ విశేషం.
ఇటీవలి కాలంలో ఆయన పెట్టిన పోస్టులు కొన్ని ఇలా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భాజపాలో చేరిపోతున్నారనే వార్తలు ముమ్మరంగా వచ్చిన నేపథ్యంలో.. ఆయన ఓ కామెంట్ పెట్టారు. 'వట్టిపోయిన ఆవు ఎక్కడున్నా ఒక్కటే' అంటూ ఆయన కిరణ్ గురించి వెటకారం చేస్తూ చక్కటి తెలుగులో ఒక పోస్ట్ పెట్టారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కూడా.. ప్రస్తావిస్తూ.. 'ఒక రాష్ట్ర సీఎం కూరగాయలు పండించి కోట్లు సంపాదించేస్తుంటారు.. మరొక రాష్ట్ర సీఎం.. కూరగాయలు, పాలు అమ్ముకుని కోట్లు సంపాదించేస్తుంటాడు.. అయితే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకూ అన్నదాతలు కష్టాలంటే పట్టింపు లేకపోవడమే ఖర్మ' అంటూ ఆయన సెలవిచ్చారు. అలాగే ఇటీవల తెలంగాణలో జరిగిన నక్సలైట్ల ఎన్ కౌంటర్ గురించి కూడా తీవ్రమైన కామెంట్లు పెట్టారు. మీడియా ద్వారా తన అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే సందర్భాలు ఇటీవల తగ్గాయని ఆయన గుర్తించారేమో గానీ.. చాన్సు దొరికితే చాలు ప్రతి విషయంలోనూ.. బోలెడు అభిప్రాయబాణాలను సంధించేస్తున్నారు.