Begin typing your search above and press return to search.
కామ్రేడ్ కు పవర్ స్టార్ నచ్చేశాడోచ్
By: Tupaki Desk | 11 Sep 2016 4:17 PM GMTకామ్రేడ్లు వెన్నపూస లాంటోళ్లు. కాసింత పొగడ్త అన్న వేడి తగిలిస్తే చాలు.. అమాంతంగా నెయ్యిగా మారిపోయి సానుకూలత అన్న ఘుమఘుమలు గుప్పిస్తారు. అందుకు భిన్నంగా విమర్శ అన్న ఐస్ ముక్కను మీదకు విసిరేస్తే.. రాయిలా మారిపోయి తమలోని మరో కోణాన్ని ప్రదర్శిస్తారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఇప్పటివరకూ విమర్శనాత్మకంగా చూసిన సీపీఐ నారాయణకు తొలిసారి పవన్ నచ్చేశాడు. ప్రతిఒక్కరిలోనూ తప్పులు వెతికే నారాయణ.. తిరుపతి సభ తర్వాత పవన్ పై విమర్శల బాణాన్ని సంధించింది నారాయణే.
అలాంటి కామ్రేడ్ కాస్తా ఇప్పుడు పొగిడేస్తున్నారు. ఎందుకిలా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తిరుపతి సభలో నారాయణ అండ్ కో మీద కాసిన్ని విమర్శలకే మండిపడ్డ నారాయణ.. కాకినాడ సభలో కామ్రేడ్లను పొగిడేయటం.. వామపక్ష భావజాలం తనకు ఇష్టమన్న వ్యాఖ్యలు పవన్ నోటి నుంచి రావటంతో నారాయణ నోటి మాట ఒక్కసారిగా మారిపోయింది. అందుకే నారాయణ తన మనసులోని మాటను దాచుకోకుండా చెప్పేశారు కూడా. పవన్ కల్యాణ్ తిరుపతి సభకు.. కాకినాడ సభకు తేడా ఉందని.. కమ్యూనిస్టులతో పవన్ చర్చిస్తానంటూ చేసిన వ్యాఖ్యల్ని తాము స్వాగతిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
పవన్ మీద పొగడ్తలు కురిపించిన ఆయన.. బీజేపీ అగ్రనేతల్లో ఒకరు.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హోదాపై ఆశలు.. భ్రమలు కల్పించింది వెంకయ్యనాయుడేనని.. అలాంటి వ్యక్తికి తనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. వామపక్షాలతో కలిసి నడిచే ఆలోచనను సంకేతాల రూపంలో చెప్పిన పవన్ మాటలు నారాయణ మైండ్ సెట్ ను మార్చేయటమే కాదు.. పవన్ లోని రెండో కోణాన్ని చూసేలా చేసిందని చెప్పాలి. అందుకే.. పవన్ పై అంతెత్తు ఎగిరిపడే నారాయణ.. ఇప్పుడు పవన్ పై ప్రేమను కురిపిస్తున్నారు. మరి.. వీరి ఫ్రెండ్ షిప్ ట్రాక్ ఎంతకాలం నడుస్తుందో చూడాలి..?