Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ వాళ్ల బ‌ల‌హీన‌త‌..వ‌దిలేయండంటున్న ఎర్ర‌న్న‌

By:  Tupaki Desk   |   22 July 2017 9:50 AM GMT
డ్ర‌గ్స్ వాళ్ల బ‌ల‌హీన‌త‌..వ‌దిలేయండంటున్న ఎర్ర‌న్న‌
X
తెలుగు రాష్ర్టాల్లో కీల‌క ప‌రిణామం ఏది జ‌రిగినా త‌న‌దైన శైలిలో స్పందించే సీపీఎం జాతీయ నేత నారాయ‌ణ తాజాగా ఓ కుదుపుకుదిపేస్తున్న డ్ర‌గ్స్ మాఫియాపై కూడా స్పందించారు. రాజ‌కీయాల గురించి త‌న‌దైన శైలిలో మాట్లాడుతూనే డ్ర‌గ్స్‌ పై కూడా విశ్లేషించారు. హైద‌రాబాద్‌ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ కేసులో తిమింగలాలను వదిలి చిన్న చేపలను వేటాడుతున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకుల హస్తం లేకుండా డ్రగ్స్ దందాలు సాగవని అన్నారు. ఈ విష‌యంలో దూకుడుగా వెళ్తున్న వారికి దమ్ము ఉంటే రాజకీయ నాయకుల పేర్లు బయట పెట్టాలని నారాయ‌ణ స‌వాల్ విసిరారు. క‌ళాకారులకు కొన్ని బలహీనతలుంటాయని, వాటిని చూసీ చూడనట్టు వదిలేయాలని నారాయ‌ణ వ్యాఖ్యానించారు. కేవ‌లం 5-6 మంది చేసే తప్పులతో మొత్తం 50 వేల మంది నమ్ముకొని బతికే సినీ కళారంగాన్ని భ్ర‌ష్టు పట్చించొద్దని ఆయ‌న కోరారు.

జాతీయ స్థాయిలో ద్వంద పాలన సాగుతోంద‌ని నారాయ‌ణ ఆరోపించారు. ఒకటి రావణాసురుని పాలన, మరొకటి అందమైన అబద్ధమ‌ని ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. గో రక్షక దళాల పేరుతో మైనార్టీ, దళితులపై విచ్చలవిడిగా దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. స్వదేశీ భక్తుల ముసుగు వేసుకుని సంఘ్‌ పరివార్ శక్తులు రెచ్చి పోతున్నాయని విమ‌ర్శించారు. ఆర్ఎస్ఎస్ మ‌రియు సంఘ్‌ పరివార్ శక్తులకు గుజరాత్ నుంచే ఊతం ఇస్తున్నార‌ని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరు ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలేన‌ని...ఇక వీరి ఇద్దరి పాలనలో సెక్యూలరిజం పాలన ఉంటుంది అనుకోవడానికి లేదని నారాయ‌ణ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. జాతీయ స్థాయిలో ఆర్థిక తిరోగమనానికి వ్యతిరేకంగా 24 - 25 - 26 సీపీఐ ఆధ్వర్యంలో మరో పోరాటానికి పిలుపునిచ్చిన‌ట్లు తెలిపారు.

దేశ చరిత్రలో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ ఇలాంటి బెదిరింపు రాజకీయాలు జరుగలేదని నారాయ‌ణ తెలిపారు. కానీ ప్ర‌ధాన‌మంత్రి మోడీ అధ్యక్ష పదవిని అద్దం పెట్టుకొని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు తెర లేపారని ఆరోపించారు.ఇలాంటి అంశాల్లో మోడీ రోల్ మోడల్ గా నిలిచార‌ని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటు వేయని వాళ్ళపై ప్రత్యేక్షంగా ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆర్డేజీ అధినేత‌ లాలూ ప్రసాద్ యాదవ్ - అన్నాడీఎంకే నాయ‌కురాలు శశికళ‌ - వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి విషయాల్లో స్పష్టం అయిందని నారాయ‌ణ అన్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు ఏకపక్షంగా మద్దతు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడి మైనార్టీ లకు,దళితులకు ఎం సమాధానం చెప్తార‌ని నారాయ‌ణ ప్ర‌శ్నించారు.