Begin typing your search above and press return to search.
వీళ్ల చర్యలు ఊహాతీతం
By: Tupaki Desk | 6 Feb 2018 9:45 AM GMTవామ పక్షనేతగా ఉన్న సీపీఐ నారాయణ అందరికి సుపరిచితుడే .మనసులో ఒకలా ..భయట ఒకలా వ్యవహరించే వ్యక్తిత్వం కాదు. కాబట్టే నారాయణ ఏం మాట్లాడినా అందులో నిజం ఉంటుందునే నమ్మేవాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే చెన్నై పర్యటనలో ఉన్ననారాయణ సీఎం చంద్రబాబు - పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశారు. ఒకరు కన్ ప్యూజన్ కు కేరాఫ్ అడ్రస్ అయితే మరొకరు కేంద్రంతో లాలూచీ పడి రాష్ట్రప్రయోజనాలకు తీలోదకాలిచ్చిన నేతంటూ మండిపడ్డారు.
చంద్రబాబు జట్టు కేంద్రం చేతిలో ఉంది. తోక జాడిస్తే ఊచలు లెక్కపెట్టడమే .అందుకే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే పట్టించుకోకుండా మీనమేషాలు లెక్కేస్తున్నారని అన్నారు. టీడీపీ తన మిత్రపక్షమైన బీజేపీపై విమర్శలు చేయకుండా డిఫెన్స్ పాలిటిక్స్ తో మమ అనిపిస్తుంది. లేదంటే ఆయన చేసిన పనులకు ఎప్పుడో జైలుకు వెళ్లాల్సి ఉండేదని ఎద్దేవా చేశారు. ఇక పవన్ కల్యాణ్ కన్ ఫ్యూజన్ పాలిటిక్స్ తో గందరగోళంలో ఉన్నారని సూచించారు. తెలంగాణలో పర్యటన చేస్తూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ హార్డ్ అండ్ స్మార్ట్ ముఖ్యమంత్రి అని, సీఎం చంద్రబాబు టెక్నాలజీకి గురూ అని పబ్బం గడిపేస్తున్నారని అన్నారు. పవన్ కు పాలిటిక్స్ పై అవగాహన లేక ఇద్దరు చంద్రుల భజన చేస్తూ పవన్ పబ్బం గడుపుకుంటున్నాడని నారాయణ ధ్వజమెత్తారు.