Begin typing your search above and press return to search.
బాబుతో పొత్తుపై నారాయణ కీలక ప్రకటన.. మరోసారి టీడీపీ గూటికి తోక పార్టీ
By: Tupaki Desk | 5 March 2021 5:05 AM GMTఅప్పటివరకు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. కాసేపటికే తిట్టినోళ్లతో కలిసిపోవటం.. వారితో కలిసి ఎన్నికల బరిలోకి దిగటం లాంటి పనులు చేసే కమ్యునిస్టులు మరోసారి అదే పని చేశారు. ఏపీలో రాజకీయ ప్రాభవం కోల్పోయిన కమ్యునిస్టుల్ని ప్రజలంతా తోక పార్టీలుగా అభివర్ణిస్తుంటారు. తమకు తాముగా బలాన్ని ప్రదర్శించే సత్తా లేని వామపక్ష వాదులు.. ఏదో ఒక పార్టీకి తోక పార్టీగా ఉంటూ కాలం గడిపేస్తుంటారు. మొన్నటివరకు చంద్రబాబు విధానాల్ని.. ఆయన తీరును తిట్టిపోసిన సీపీఐ జాతీయకార్యదర్శి నారాయణ.. తాజాగా కీలక ప్రకటన చేశారు.
ఇప్పటికే పలుమార్లు టీడీపీతో కలిసి పోటీ చేయటం.. ఆ తర్వాత ఆ పార్టీకి దూరం కావటం తెలిసిందే. తాజాగా మరోసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు నారాయణ వెల్లడించారు. టీడీపీతో పొత్తు విషయాన్ని నారాయణ స్వయంగా కన్ఫర్మ్ చేశారు.
మరింత కాలం టీడీపీని.. ఆ పార్టీఅధినేత చంద్రబాబును తిట్టిపోశారుగా అంటే.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. మిత్రులు ఉండరని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో స్నేహపూర్వకంగా పొత్తుతో వెళుతున్నట్లు చెప్పారు. నారాయణ ప్రకటనకు ముందుగానే.. విజయవాడ.. గుంటూరుకార్పొరేషన్ల పరిధిలో సీపీఐ.. టీడీపీలు సీట్ల షేరింగ్ చేసుకుంటున్నాయి. కానీ.. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించటం మాత్రం ఇదే తొలిసారిగా చెప్పాలి.
స్థానిక ఎన్నికల్లో చంద్రబాబుతో కుదిరిన పొత్తు భవిష్యత్తులోనే కొనసాగించే వీలు ఉందన్నారు. తమకంటూ ఒక స్టాండ్ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకునే కమ్యునిస్టుల మాటలకు ప్రజలు తమ ఓటుతో ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలి.