Begin typing your search above and press return to search.
విలాసవంతమైన బిక్షగత్తె.. ‘క్వీన్’ను మాటలతో ఉతికేశాడు
By: Tupaki Desk | 12 Nov 2021 5:30 AM GMTఅభిమానం ఉండొచ్చు. అంతకు మించిన విధేయత తప్పు కాదు. కానీ.. దాన్ని ప్రదర్శించేందుకు అనకూడని మాటల్ని అనటం ముమ్మాటికి తప్పే అవుతుంది. మరే బాలీవుడ్ నటీమణి ప్రదర్శించనంత ప్రేమాభిమానాల్ని కేంద్రంలోని అధికారపక్షం మీద ప్రదర్శిస్తూ.. దాని గొప్పల గురించి చెప్పేందుకు అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు సైతం వెనుకాడని తీరు బాలీవుడ్ క్వీన్.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కంగనా రౌనత్ సొంతం. తాజాగా ఆమె దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చింది 2014లో అంటూ మోడీ సర్కారుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటివరకు కంగనాను ఉద్దేశించి విమర్శలు చేయని వారు సైతం.. తాజా వ్యాఖ్యల్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి వేళ.. దారుణ వ్యాఖ్యల్ని అలవోకగా చేసే సీపీఐ నారాయణ గళం విప్పారు. ఇప్పటి వరకు కంగానాను ఎవరు అనని రీతిలో ఆయన మండిపడ్డారు. దేశంలో విలాసవంతమైన బిక్షగత్తె ఎవరైనా ఉన్నారంటే అది ఈ మధ్యనే పద్మశ్రీ తీసుకున్న నటి కంగనా రౌనత్ అని వ్యాఖ్యానించారు. ఆమెకు స్వాంతంత్య్ర పోరాటం గురించి పెద్దగా తెలీదని.. ఆ మాటకు వస్తే.. ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చిన బీజేపీకి సైతం తెలీదని ఫైర్ అయ్యారు.
1947లో వచ్చిన స్వాతంత్య్రం బిక్ష అని.. అసలైన స్వాతంత్య్రం బీజేపీ వచ్చిన తర్వాతే అంటూ కంగనా వ్యాఖ్యానించిన వ్యాఖ్యలపై నారాయణ మరింత ఘాటుగా రియాక్టు అయ్యారు. ‘‘ఇంతకంటే బానిసత్వం ఏం ఉంటుంది. నువ్వు అడుక్కోవాలంటే అడుక్కో. అందుకు ఎలాంటి అభ్యంతరం లేదు.నీకు బిక్ష ఆర్ఎస్ఎస్ పెడితే.. దాన్ని స్వాతంత్య్ర పోరాటంతో పోలుస్తావా? నీకు దాని గురించి మాట్లాడే అర్హత లేదు. నీకు పద్మశ్రీ అవార్డు ఇచ్చిన ప్రభుత్వానికి లేదు’’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కంగనా వ్యాఖ్యల్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని.. సమాజానికి ఆమె క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ సందర్భంగా మరో దారుణమైన పోలికకు తెర తీశారు నారాయణ. ‘కుష్టి రోగి కంటే మించిన రోగిష్టి. ఆమె తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేయటం ఖాయం’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరి.. ఈ వివాదంపై కంగనా మరెలా రియాక్టు అవుతుందో చూడాలి.