Begin typing your search above and press return to search.
గంటా ఖాతాలో 650 కోట్ల కుంభకోణం
By: Tupaki Desk | 19 Dec 2016 3:58 PM GMTసీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ సంచలన కామెంట్లు చేశారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని - దీనికి కేబినెట్లో కీలకమైన మంత్రి గంటా శ్రీనివాసరావు 650 కోట్ల విలువైన భూ కుంభకోణమే నిదర్శనమని రామకృష్ణ పేర్కొన్నారు. జీవో 290 ప్రకారం అసైన్డ్ భూములు ఎవరికీ అమ్మడానికి - కొనడానికి వీల్లేదన్నారు. కాని మంత్రి గంటా మాత్రం రూ. 650 కోట్ల విలువైన అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకున్నారన్నారు. దీనిపై ముఖ్యమంత్రి తక్షణమే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడును కలిసి సదరు వివరాలు అందజేశారు.
విజయవాడలో రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు ఇబ్బందులపై 50 రోజులు ఓపిక పట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారని, దానికి ప్రజలు సంసిద్దులై సహనం వహిస్తున్నారని చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితులు గమనిస్తుంటే 40 రోజులు దాటినా ఇప్పటివరకు కరెన్సీ కష్టాలు ఏమాత్రం తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాత్రం అవినీతి, నల్లధనం నిర్మూలనకు ప్రధాని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టేందుకు యత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. పెద్ద నోటంటే ఐదు వందలా ? వెయ్యా ? లేక 2వేల నోటా ? వెంకయ్య చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దనోట్ల ఇబ్బందులపై ఓపిక పట్టాలని నీతిసూత్రాలు వల్లిస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇంకా ఎన్ని రోజులు ఓపిక పట్టాలో స్పష్టం చేయాలని రామకృష్ణ నిలదీశారు. కేవలం కార్పోరేట్లకు దోచిపెట్టడానికే క్యాష్ లెస్ ఎకనామీ అంటూ కొత్తపాట పాడుతున్నారని విమర్శించారు. రూ.500, వెయ్యి నోట్ల రద్దు చేసినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ క్యాష్ లెస్ ఆర్థిక లావాదేవీల గురించి మాట్లాడలేదని, ఇప్పుడు ప్రజల ఇబ్బందులు తీవ్రం కావడంతో పరిష్కరించలేక కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు. దీనిపై మోడీ, బీజేపీ ప్రజాకోర్టులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రామకృష్ణ హెచ్చరించారు.
అవినీతిని అరికట్టలేని, విదేశాల్లో నల్లడబ్బును వెనక్కితీసుకురాలేని అసమర్థ ప్రధాని మోడీ ఇప్పుడు లంచం ఇచ్చిన వారిని కూడా దండించేలా చట్టం తెస్తామంటూ మోడ్రన్ తుగ్లక్ వలే వ్యవహరిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. మోడీ తుగ్లక్ చర్యలను గమనిస్తున్న మేధావులు పెద్దనోట్ల రద్దును తొలుత మెచ్చుకున్నవారు సైతం ఇప్పుడు విమర్శిస్తున్నారని లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ లాంటి వారు చేసిన వ్యాఖ్యలను ఉదాహరించారు. దేశవ్యాప్తంగా 16 రాజకీయపార్టీలు కరెన్సీ కష్టాలపై ఆందోళన చేస్తున్నా పార్లమెంటులో విపక్షాలు చర్చకు పట్టుబట్టినా కనీసం సమాధానం చెప్పకుండా మోడీ నియంతలా వ్యవహరించడం దారుణమన్నారు. ఈనేపధ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిసూ, సామాన్యుల కరెన్సీ కష్టాలు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22వ తేదీ సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా అన్ని లీడ్ బ్యాంకుల ఎదుట సామూహిక సత్యాగ్రహం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఇదే సమస్యపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈనెల 23వ తేదీ నిర్వహిస్తున్న చలో వెలగపూడి కార్యక్రమానికి సీపీఐ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/