Begin typing your search above and press return to search.
ఏపీలో బీజేపీ ఉందా...చచ్చిందా?
By: Tupaki Desk | 20 Dec 2016 5:57 AM GMTసీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కేంద్ర ప్రభుత్వంపై - బీజేపీ పార్టీలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. వేముల రోహిత్ - ప్రత్యేక హోదా - గోవధ తదితర అనేక అంశాలపై జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వరుసగా ట్వీట్ చేస్తూ విమర్శలు చేస్తున్నా రాష్ట్రానికి చెందిన ఒక్క బీజేపీ నేత కూడా వాటికి స్పందించి సమాధానం చెప్పకపోవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ ఉందా ? చచ్చిందా ? లేక నేతలంతా మౌనవ్రతం పాటిస్తున్నారా ? అని రామకృష్ణ ప్రశ్నించారు. రాజకీయ పార్టీగా మనుగడ సాధించాలంటే పవన్ వ్యాఖ్యలపై ఏదో ఒక సమాధానం చెప్పాలి ? కాని ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడిందంటే మీ మోసాలను అంగీకరించినట్లు భావించాలా ? ఆవిషయమైనా ప్రజలకు చెప్పండి అంటూ ప్రశ్నల వర్షం గుప్పించారు.
నోట్ల రద్దుతో ప్రజలకు ఇబ్బందుల్లేవని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలపై రామకృష్ణ ఆయన మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తలెత్తిన ఇబ్బందులపై ప్రజలు ఇంకా ఎంతకాలం ఓపిక పట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు పిచ్చి నిర్ణయమని తెలుసుకున్న ప్రధాని మోడీ, సిఎం చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించేందుకే నగదు రహిత లావాదేవీలను తెరమీదకు తెచ్చారని విమర్శించారు. కానీ ఈ విషయంలో బ్రహ్మండం బద్దలవుతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారని రామకృష్ణ వ్యాఖ్యానించారు. డిసెంబర్ 31 లోపు నోట్ల ఇబ్బందులను పరిష్కరిస్తామని కేంద్రం స్పష్టత ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వామపక్షపార్టీల సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 22న అన్ని జిల్లాల లీడ్ బ్యాంకుల వద్ద సత్యాగ్రహ కార్యక్రమం చేపడతామన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/