Begin typing your search above and press return to search.
చంద్రబాబు, వెంకయ్యలతో సినిమా తీయాలట!
By: Tupaki Desk | 19 Sep 2016 6:38 AM GMTకేంద్రం ఆంధ్రాకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తరువాత ప్రజల్లో అసంతృప్తులు బాగానే పెరుగుతున్నాయి! ఈ అసంతృప్తిని ఎలా వెళ్లగక్కాలో వారికి అర్థం కావడం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో సెటైర్లు పెరిగిపోతున్నాయి! ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపైనా.. కేంద్రమంత్రి వెంకయ్యపైనా సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు దర్శనమిస్తున్నాయి. ప్రత్యేక హోదా అంటూ ఊరించిన వెంకయ్య ఇప్పుడు ప్యాకేజీ గొప్పతనం చెప్పడానికి ఆంధ్రాకి వచ్చారంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నారు. ప్రత్యేక హోదా పోరాడి సాధించుకుంటాం అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి భాజపా భజనలో పడ్డారని అంటున్నారు! అంతేకాదు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడికి సన్మానం జరగడంపై విమర్శలు బాగానే వినిపిస్తున్నాయి. చాలా సెటైర్లు పడుతున్నాయి. ఈ క్రమంలో సీపీఐ కార్యదర్శి రామకృష్ణ చేసిన విమర్శలు కాస్త ఆసక్తికరంగానే ఉన్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు... ఈ ఇద్దరితో సినిమా తీస్తే బాగుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఆ చిత్రానికి టైటిల్ కూడా ఆయనే చెప్పారు. అదేంటంటే... తోడు దొంగలు! చంద్రబాబు - వెంకయ్యలను పెట్టిన ఇప్పుడో సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుందని రామకృష్ణ వ్యంగ్యంగా అన్నారు. ఈ ఇద్దరూ తోడు దొంగలు మారిదిగా తయారయ్యారన్నారు. అందుకే సినిమా హిట్ కావడం ఖాయం అన్నారు. ఈ తరుణంలో అయితేనే ఈ సినిమాను ప్రజలు బాగా చూస్తారన్నారు. భారతీయ జనతా పార్టీ తీసిన ప్రత్యేక హోదా చిత్రం భారీ ఫ్లాప్ అయిందన్నారు. అయినా సరే - కేంద్రమంత్రి వెంకయ్య ఎందుకు సన్మానాలు చేయించుకుంటున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు.
ఆంధ్ర్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతున్నా ప్రధాని మోడీ దగ్గర ఈ ఇద్దరూ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అని నిలదీశారు. పిరికిపందల్లా నిలబడాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఆంధ్రాలో సాగుతున్న పొలిటికల్ సినిమాను ప్రజలు చూస్తున్నారనీ, భాజపా తెలుగుదేశం పార్టీలకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందని రామకృష్ణ అన్నారు. వెంకయ్య - బాబులతో సినిమా అనడం ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే నెటిజన్ల ఆగ్రహానికి ఈ ఇద్దరు నేతలూ గురౌతున్నారు. ఇప్పుడీ సినిమా టాపిక్ తేవడంతో ఇంకెన్ని వ్యంగ్యాస్త్రాలు వస్తాయో, ఎన్ని కొత్త కార్టూర్లు తయారైపోతాయో..!